Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా కొడుకుని ప్రేమించావా? ఇంటికి రా మాట్లాడుకుందాం అని పిలిచి అత్యాచారం...

Advertiesment
man
కొడుకు ప్రేమించిన యువతితో పెళ్లి చేసేందుకు ఇష్టం లేని ఒక వ్యక్తి తనకు కాబోయే కోడలిపై అత్యాచారం చేశాడు. పెళ్లి గురించి మాట్లాడుకునేందుకు ఇంటికి రప్పించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తమిళనాడు రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. 
 
కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక వ్యక్తి కొడుకు ప్రేమించిన అమ్మాయిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి విషయం మాట్లాడుకునేందుకు ఆమెను ఇంటికి పిలిచిన వ్యక్తి ఆమెను నిర్బంధించి అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.  
 
నాగపట్టణానికి చెందిన నిత్యానందం అనే వ్యక్తి పట్టణంలో బట్టల దుకాణం నడుపుతున్నాడు. అతడి కొడుకు ముఖేశ్‌ అదే ప్రాంతానికి చెందని ఒక యువతిని ప్రేమించాడు. ఆ అమ్మాయికి ఆస్తులేమీ లేకపోవడంతో నిత్యానందం కోడలిగా చేసుకునేందుకు ఇష్టపడలేదు. ఈ విషయం చెబితే కొడుకు తనను ఎదిరించి పెళ్లి చేసుకుంటాడేమోనని భయపడ్డాడు. ఆమె జీవితాన్ని నాశనం చేస్తే కొడుకు పెళ్లి చేసుకోడని ఓ దుర్మార్గపు ప్లాన్ వేశాడు.
 
ప్లాన్‌లో భాగంగా 20 రోజుల క్రితం ఆ యువతికి ఫోన్ చేసి పెళ్లి విషయం మాట్లాడుకునేందుకు రావాలని కోరాడు. ఆమె ఇంటికి వెళ్లగా మాటల్లో దించి తలుపులు మూసేశాడు. సెల్‌ఫోన్ లాక్కుని జేబులో నుంచి తాళి తీసి బలవంతంగా ఆమెకు కట్టేశాడు. అంతటితో ఆగకుండా గదిలో బంధించి రెండ్రోజుల పాటు అనేకసార్లు అత్యాచారం చేశాడు. 
 
ఆ కామాంధుడి బారి నుంచి ఎట్టకేలకు తప్పించుకున్న బాధితురాలు ఫ్రెండ్ ఇంటికి చేరుకుంది. అక్కడి నుంచి పోలీస్‌‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న వేదారణ్యం పోలీసులు నిందితుడిని నిన్న రాత్రి అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్భయ దోషి చివరి కోరిక కోసం మరో 14 రోజులు, ఆ నలుగుర్నీ త్వరగా ఉరి తీయండి