Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ కు ఐక్యరాజ్య సమితి ఝలక్

United Nations
Webdunia
శనివారం, 10 ఆగస్టు 2019 (08:37 IST)
జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ చేసిన విన్నపాన్ని ఐక్యరాజ్యసమితి తోసిపుచ్చింది. ఈ విషయం ఇరు దేశాల ద్వైపాక్షిక అంశంగా ఐక్యరాజ్యసమితి తేల్చి చెప్పింది.
 
జమ్మూకాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ భారత్  నిర్ణయం తీసుకొంది.  అంతేకాదు ఈ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కూడ విభజించింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మధ్యవర్తిత్వం వహించాలని ఐక్యరాజ్యసమితిని పాక్ కోరింది.
 
ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటేరస్  కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు నిరాకరించినట్టుగా ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ ప్రకటించారు.  కాశ్మీర్ వ్యవహరాన్ని పాక్ రాయబారి మలీహా లోధి గుటెరస్ దృష్టికి తీసుకొచ్చారు. కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని కోరాడు. కానీ, ఈ విషయంలో పాక్ కు ఐక్యరాజ్యసమితి తన వైఖరిని స్పష్టం చేసింది.
 
1972లో పాకిస్తాన్, భారత్ మధ్య జరిగిన సిమ్లా ఒప్పందాన్ని గుటెరస్ గుర్తు చేశారు. ఈ అంశం రెండు దేశాల ద్వైపాక్షిక అంశంగా ఆయన అభిప్రాయపడినట్టుగా డుజారిక్ ప్రకటించారు. 
 
చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభించనుందని ఆయన స్పష్టం చేశారు. మూడో పక్షం మధ్యవర్తిత్వం అవసరం లేదని  ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంలో రెండు దేశాలు సంయమనంతో ఉండాలని ఆయన కోరారు. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాలని భద్రతా మండలికి పాక్ విదేశాంగ మంత్రి పంపిన లేఖను భద్రతా మండలి సభ్యులకు కూడ పంపినట్టుగా ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments