Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్ అణు కార్యక్రమం : ఆంక్షలు మరింత కఠినతరం...

ఠాగూర్
ఆదివారం, 28 సెప్టెంబరు 2025 (10:39 IST)
ఇరాన్‌ అణు కార్యక్రమంపై ఆంక్షలను ఐరాస పునరుద్ధరించింది. ఆదివారం అర్థరాత్రి నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. దీంతో ఇప్పటికే ఆహారం, నిధుల కొరత ఎదుర్కొంటున్న ఆ దేశం మరింత కష్టాల్లోకి జారనుంది. ఆంక్షలను ఆపేందుకు చివరి నిమిషం వరకు ఇరాన్‌ ప్రయత్నించినా విఫలమైంది. 
 
ఐరాస ఆంక్షల ప్రకారం ఇరాన్‌కు విదేశాల్లో ఉన్న ఆస్తులను స్తంభింపజేయడం, ఆయుధ డీల్స్‌ను నిలిపివేయడం వంటివి చేయనున్నారు. ఇరాన్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ ప్రోగ్రామ్‌పై చర్యలు తీసుకోవడం కూడా ఈ జాబితాలో ఉంది. నిజానికి అక్టోబరు 18తో ఈ ఆంక్షలు శాశ్వతంగా తొలగిపోవాల్సి ఉంది. అయితే గతంలో జరిగిన జాయింట్‌ కాంప్రిహెన్సివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ (జేసీపీవోఏ) ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘించింది. దీంతో ఆంక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 
 
జేసీపీవోఏ ఒప్పందం ప్రకారం అందులో సంతకం చేసిన ఏ దేశమైనా అవసరమైతే ఆంక్షలను పునరుద్ధరించవచ్చు. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఐరోపా దేశాల ప్రతినిధులు ఆగస్టులోనే ఐరాసకు వెల్లడించారు. జర్మనీ, యూకే 30 రోజుల క్రితమే ఆంక్షలను పునరుద్ధరించాలని నిర్ణయించాయి. 
 
దీనికి తోడు ఈ ప్రక్రియను ఐరాస భద్రతా మండలి వీటో చేయడానికి వీల్లేకుండా డిజైన్‌ చేశారు. దీంతో చైనా, రష్యా ఈ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇదిలావుండగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ మాట్లాడుతూ ఈ ఆంక్షలు ఇరాన్‌కు ఉచ్చుగా అభివర్ణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments