హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనాడు సినీ ప్రముఖులకు తీవ్ర అవమానం జరిగిందని, కానీ ఎవరూ గట్టిగా నిలదీయలేకపోయారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమకు అవమానం జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా, బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను బాలకృష్ణ తోసిపుచ్చారు. చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ సమావేశానికి అంగీకరించారని కామినేని అనగా, అది సరికాదని బాలకృష్ణ అన్నారు. వాస్తవానికి ఎవరూ జగన్‌ను గట్టిగా అడగలేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
అప్పట్లో సినీ సమస్యలపై చర్చించేందుకు జగన్‌తో జరిగిన సమావేశానికి తనకు కూడా ఆహ్వానం అందిందని, అయితే తాను ఆ సమావేశానికి హాజరు కాలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవిని సైతం పిలిచి ఆ సైకో అవమానించారు... ఆ రోజు తనను పిలిచినా తాను వెళ్లలేదని బాలయ్య అన్నారు.