Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ నుంచి భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు రాక

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (13:57 IST)
ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధంలో చిక్కుకున్న భారత పౌరులను, విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరుతో ప్రత్యేక విమానాలను నడుపుతోంది. తొలుత ఎయిర్ ఇండియా విమానాలను రంగంలోకి దిగిన భారత్... ఏకంగా వైమానికి దళానికి చెందిన సి-17 విమానాలను ఉపయోగిస్తుంది. 
 
ఈ నేపథ్యంలో గురువారం ఉక్రెయిన్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. ఏకంగా 19 విమానాల్లో 3,726 మంది విద్యార్థులు స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అనేక వందల మంది విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. మరికొంతమంది సాయంత్రం లోపు మాతృభూమికి చేరుకోనున్నారు. 
 
ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను రోడ్డు మార్గంలో సరిహద్దులు తరలించి, అక్కడ నుంచి ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన పోలాండ్, రోమేనియా, బొలీవియా వంటి దేశాల నుంచి తరలిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, 8 విమానాలు బుకారెస్ట్ నుంచి మరో రెండు విమానాలు సుసేవ నుంచి కోసీ నుంచి ఒకటి, బుడాపెస్ట్ నుంచి ఐదు, రెస్టోవ్ నుంచి మూడు విమానాలు బయలుదేరుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖాకమంత్రి జ్యోతిరాదిత్య సింథియా వెల్లడించారు. ప్రధాని ఆదేశాలతో ఒక్క రోజులోనే 3726 మందిని స్వదేశానికి తరలించేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments