Webdunia - Bharat's app for daily news and videos

Install App

కండోమ్‌కు చిల్లులు పెట్టాడని నాలుగేళ్ళ జైలు... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (17:56 IST)
కొన్ని కేసుల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు వినేందుకు ఆశ్చర్యంగా ఉంటాయి. తాజాగా ఓ కోర్టు.. కండోమ్‌కు చిల్లు పెట్టినందుకు ఓ వ్యక్తికి నాలుగేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును లండన్‌ కోర్టు వెలువరించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బ్రిటన్‌కు చెందిన 47 యేళ్ళ వ్యక్తికి ఓ మహిళ పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరూ మరింత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో శారీరకంగా కలవాలంటే.. కండోమే ధరించాల్సిందే అంటూ ఆమె కండిషన్ పెట్టింది. ఆమెతో శారీరక సుఖం పొందాలన్న తపనతో ఆ వ్యక్తి తొలుత ఆమె నిబంధనకు అంగీకరించాడు. 
 
అయితే, కొన్ని రోజుల తర్వాత కండోమ్‌కు సూదితో చిల్లు పెట్టి... శృంగారంలో పాల్గొనసాగాడు. ఓ రోజున పడకపై కండోమ్ ప్యాకెట్‌తో పాటు సూది ఉండటాన్ని ఆమె గమనించింది. ఆ తర్వాత అతనికంటే ముందుగా నిద్రలేచి డస్ట్‌పిన్‌లోని కండోమ్స్‌ను పరిశీలించగా, వీర్యమంతా అందులో పడివుండటాన్ని గమనించింది. అంటే, కండోమ్‌కు చిల్లుపెట్టి తనతో శృంగారంలో పాల్గొంటున్నట్టు తెలుసుకుంది. 
 
ఈ వ్యవహారం చివరకు కోర్టు వరకు వెళ్లింది. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు... నిందితుడు నేరం చేశాడని కోర్టు తీర్పునిచ్చింది. అతనిపై ఆమె పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేసి, అత్యాచారానికి పాల్పడ్డాని పేర్కొంటూ, నాలుగేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం