Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త పబ్‌జీ గేమ్ ఆడుకోనివ్వడం లేదు.. విడాకులిప్పించాలన్న భార్య

Webdunia
మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (10:51 IST)
ఇటీవలికాలంలో వివిధ రకాల యాప్ గేమ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి గేమ్స్‌ను పిల్లలు అధికంగా ఆడుతుంటారు. కానీ, పబ్‌జీ వంటి గేమ్స్ వచ్చాక.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆడుతున్నారు. ఈ పబ్‌జీ గేమ్‌కు బానిసలైన అనేక మంది యువతీయువకులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటను విన్నాం. 
 
కానీ, ఇపుడో మహిళ ఏకంగా భర్త నుంచి విడాకులు కోరింది. తన భర్త పబ్‌జీ గేమ్ ఆడుకోనివ్వడం లేదని అందువల్ల తనకు విడాకులు మంజూరు చేయాలని కోరింది. దీంతో ఖంగుతిన్న అధికారులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. యూఏఈలోని అజ్మన్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
 సాధారణంగా పిల్లలే మొబైల్‌ గేమ్స్ ఆడుతుంటారు. అయితే పబ్‌జీ వచ్చాక ఈ పరిస్థితి తలకిందులైంది. చిన్నపెద్దా తారతమ్యం లేకుండా అందరూ ఈ గేమ్‌లో మునిగిపోతున్నారు. ఎంతలా అంటే ఆ గేమ్ తప్ప వేరే ఏ పనీ చేయనంతగా. అందుకే కొన్ని దేశాలు ఈ గేమ్‌పై నిషేధం కూడా విధించాయి. 
 
అజ్మన్‌కు చెందిన 20 యేళ్ళ యువతికి వివాహమైంది. కానీ, పిల్లలు లేరు. ఈమె అజ్మన్ పోలీసుల శాఖకు చెందిన సోషల్ సెంటర్‌కు వెళ్లి ఓ ఫిర్యాదు చేసింది. 'నన్ను నా భర్త పబ్‌జీ గేమ్ ఆడుకోనివ్వడం లేదు. మాకు విడాకులు ఇప్పించండి' అని విజ్ఞప్తి చేసింది. దీంతో ఖంగుతిన్న అధికారులు ఆమెను కూర్చొబెట్టి, ఆమె భర్తను పిలిపించి మాట్లాడారు. 
 
తన స్వేచ్ఛను భర్త హరిస్తున్నాడని ఆమె అంటుండగా.. ఆమె కుటుంబ బాధ్యతలను సరిగా నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే తాను అలా చేశానని భర్త సమాధానం ఇచ్చాడు. వీరిద్దరికీ సర్ది చెప్పేసరికి పోలీసుల తల ప్రాణం తోకకు వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments