పెంపుడు జంతువుల పట్ల సంపన్నుల పీనాసితనం.. విరక్తితో వెటర్నరీ డాక్టర్...

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (12:43 IST)
పెంపుడు జంతువుల పట్ల సంపన్నులు ప్రదర్శిస్తున్న పీనాసితనంతో విరక్తి చెందిన ఓ పశువైద్యుడు మనసు విరక్తి చెందిన ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన జరిగింది. ఇందుకోసం అతను నొప్పి తెలియకుండా, జంతువుల ప్రాణం తీసే మందును తన శరీరంలోకి ఎక్కించుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. లండన్‌కు చెందిన ఈ వెటర్నీ డాక్టర్ ఈ విషాదకర నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, 
 
లండన్ వించెస్టర్‌లో జాన్ ఎల్లిస్ అనే వ్యక్తి పశువైద్యుడుగా పని చేస్తున్నాడు. వయసు 35 యేళ్ళు. అయితే, తన వృత్తిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. తన వద్దకు తీసుకొచ్చే జంతువులను చూడగానే వాటి అనారోగ్యాన్ని ఇట్టే పసిగట్టగల తెలివితేటలు ఆయన సొంతం. అయితే, పెంపుడు జంతువులు అనారోగ్యానికి గురైనపుడు వాటికి ఖర్చు చేసే మొత్తం కంటే.. వాటిని చంపేందుకు (యూథనేషియా) వారు ఖర్చు చేసే మొత్తమే అధికంగా ఉండటం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. 
 
లగ్జరీ కార్లలో తిరుగుతూ, ఖరీదైన లైఫ్ స్టైల్ మెయింటెన్ చేస్తున్న వారు తమ పెంపుడు జంతువుల విషయంలో మాత్రం పీసనారితనంతో వ్యవహరించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. పైగా, అనారోగ్యంబారిన పడిన జంతువులను చంపేయాలని కోరేవారని, ఉద్యోగ బాధ్యతల కారణంగా గత్యంతరం లేక చేయాల్సివస్తుందని ఆవేదనకు గురయ్యేవాడు. ఇది తట్టుకోలేక ఒత్తిడికిలోనై చివరకు తనే బలవన్మరణానికి పాల్పడ్డారని జాన్ ఎల్లిస్ తల్లి టినా ఎల్లిస్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

వైభవంగా వంశీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం

Venkatesh: మళ్ళీ పెళ్లి చేసుకుందాం అంటున్న విక్టరీ వెంకటేష్

Savitri : సావిత్రి 90 వ జయంతి సభ - మహానటి చిత్ర దర్శక నిర్మాతలకు సత్కారం

Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ పాట... ఆట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments