Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కారు వెనక్కి వస్తుండగా బలంగా ఢీకొట్టిన ట్రక్కు... వీడియో వైరల్

innova car - truck

ఠాగూర్

, గురువారం, 21 నవంబరు 2024 (11:25 IST)
కర్నాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా ఎనిమిది మంది గాయపడ్డారు. రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని శ్రీ చండికా దుర్గా పరమేశ్వరి ఆలయంలోకి వెళ్లేందుకు జాతీయ రహదారి-66పై రివర్స్‌ తీసుకుంటుండగా, అతివేగంతో దూసుకొచ్చిన ఓ ట్రక్కు.. ఇన్నోవా కారును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్‌తో సహా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. కేరళకు చెందిన ఏడుగురు ఇన్నోవా కారులో గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 
టీమ్ మెంబరుతో రెహ్మాన్‌ రిలేషన్‌లో ఉన్నారా? 
 
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ దంపతులు విడిపోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రెహ్మాన్ సతీమణి సైరా భాను ప్రకటించారు. ఆ తర్వాత రెహ్మాన్ కూడా తన భార్య చేసిన విడాకుల ప్రకటనపై స్పందించారు. అయితే, వీరిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం రెహ్మాన్ సంగీత బృందంలో పని చేసే ఓ సభ్యురాలే ప్రధాన కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. ఇలాంటి ప్రచారానికి ప్రధాన కారణ ఆమె వ్యవహారశైలినే. రెహ్మాన్ దంపతులు విడిపోతున్నట్టు ప్రకటించిన ఓ గంట వ్యవధిలోనే రెహ్మాన్ టీమ్ సభ్యురాలు కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించారు. దీంతో రెహ్మాన్‌ ఆ సభ్యురాలితో రిలేషన్‌లో ఉన్నట్టు ప్రచారం సాగింది. ఆమె పేరు మోహని డే. అయితే, ఈ ప్రచారంపై రెహ్మాన్, మోహినిలు స్పందించలేదు. 
 
కాగా, తమ విడాకులపై మోహిని విడుదల చేసిన ప్రకటనలో "ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. భారమైన హృదయంతో, భర్త మార్క్ నేను విడిపోయామని ప్రకటిస్తున్నాను. మా ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం. అంటూ తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చింది. 
 
అయితే ఏఆర్ రెహ్మాన్ విడిపోతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లో మోహిని పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అందుకే గంటల తేడాతో విడాకులు ప్రకటించారని చర్చ జరుగుతోంది. మోహిని ఏఆర్ రెహ్మాన్‌తో కలిసి కొన్నేళ్లుగా పని చేస్తోందని తెలుస్తోంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.1899తో రీఛార్జీ చేసుకుంటే ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ