Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లింలను ఒక్కతాటికి వచ్చేలా చేసిన ట్రంప్ మహాశయా నీకు జోహార్లంటున్న జిహాదీలు

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏడు ముస్లిందేశాల ప్రజలకు బద్దశత్రువుగా కనిపిస్తుండవచ్చు కానీ ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ సహా జిహాది గ్రూపులు ట్రంప్‌ను ఆప్తమిత్రుడుగా భావిస్తున్నాయట. ఎందుకంటే ప్రపంచ జిహాదీలకు ట్రంప్ చేసిన మేలు ఇంతా అంతా కా

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (00:47 IST)
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏడు ముస్లిందేశాల ప్రజలకు బద్దశత్రువుగా కనిపిస్తుండవచ్చు కానీ ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ సహా జిహాది గ్రూపులు ట్రంప్‌ను ఆప్తమిత్రుడుగా భావిస్తున్నాయట. ఎందుకంటే ప్రపంచ జిహాదీలకు ట్రంప్ చేసిన మేలు ఇంతా అంతా కాదు మరి. ఇస్లామిక్‌ దేశాల పౌరులను అమెరికాలోకి రాకుండా నిషేధం విధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ను ‘ముస్లింలు ఒక్కతాటికి వచ్చేలా చేసిన గొప్ప వ్యక్తి’ అని జిహాదీ సంస్థలు కీర్తిస్తున్నాయి.
 
సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధంతోపాటు ఇస్లామిక్‌ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్  పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తూ ట్రంప్‌ ఫర్మానా జారీచేసిన మరుసటి రోజు నుంచి ఉగ్రవాదులు పండుగ చేసుకుంటున్నారని ఐసిస్‌ అధికారిక వార్తాపత్రిక, అనధికారిక వెబ్‌సైట్‌లో వార్తలు కనిపించాయి.
 
ట్రంప్‌ విధానాలతో విదేశాల నుంచి వచ్చే ముస్లింలేకాక, అక్కడే పుట్టిపెరిగిన అమెరికన్‌ ముస్లింలను కూడా ఒత్తిడికి గురిచేస్తుందని, దీంతో మరో మార్గంలేని అమెరికన్‌ ముస్లింలు.. జిహాదీలకు మద్దతుపలుకుతారని ఐసిస్‌ అనుబంధ వెబ్‌సైట్‌ పేర్కొంది. సిరియా కేంద్రంగా నడుస్తోన్న ఈ వెబ్‌సైట్‌లో వచ్చే వార్తలు, వెల్లడయ్యే అభిప్రాయాలను అమెరికా రక్షణశాఖ కూడా ప్రామాణికంగా తీసుకుంటుండటం గమనార్హం.
 
ట్రంప్‌ నిర్ణయం వెలువడిన తర్వాత, ఇక ఐసిస్‌ చీఫ్‌ అబూ బకర్‌ అల్‌ బాగ్ధాదీ అజ్ఞాతంలో దాక్కోవాల్సిన అవసరం లేదని, ధైర్యంగా బయటికి వచ్చి, ట్రంప్‌కు థ్యాంక్స్‌ చెప్పాలని వెబ్‌సైట్‌లో కొందరు కామెంట్లు చేయగా, పశ్చిమదేశాలు ముస్లింల వెంటపడతాయంటూ అవ్లాకీ(ఇరాకీ మాజీనేత) చెప్పిన జోస్యాన్ని ఇంకొందరు గుర్తుచేసుకున్నారు. అమెరికాపై, యూరప్‌ దేశాలపై దాడులు చేయాలనే తమ లక్ష్యం ఇప్పుడు మరింత సులువు కానుందని జిహాదీలు భావిస్తున్నట్లు షియా ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది.
 
అమెరికాకే చెందిన మాజీ అధికారులు సైతం జిహాదీ వెబ్‌సైట్లలో వ్యక్తమైన అభిప్రాయాలతో ఏకీభవించారు. ఐసిస్‌ తన ప్రభావాన్ని మరింత బలంగా చాటుకునేందుకు ట్రంప్‌ నిర్ణయం సహకరిస్తుందని సెనేట్‌ ఆర్మడ్‌ సర్వీస్‌ కమిటీ మాజీ చైర్మన్‌  జాన్‌ మెక్‌కెయిన్‌ అన్నారు. సీఐఏ మాజీ ఏజెంట్‌ రాబర్ట్‌ రిచర్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏడుదేశాలపై నిషేధం వ్యూహాత్మక తప్పిదమని అన్నారు.
 
‘టెర్రరిస్ట్‌ గ్రూపుల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మేం ఏజెంట్లను నియమిస్తాం. తద్వారా దాడులకు సంబంధించిన కొంత సమాచారమైనా మాకు తెలుస్తుంది. అలా అమెరికాకు అనుకూలంగా పనిచేసే గూఢచారులంతా స్థానికులే ఉంటారు. ఇప్పుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో గూఢచారులను తయారుచేయడం అసాధ్యం’ అని రాబర్ట్‌ అన్నారు.
 
మొత్తంమీద ట్రంప్ అమరికా కొంప నిండా ముంచుతున్నట్లే కనబడుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments