Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లు రాజీనామా చేస్తారా? అంతకుముందే ప్యాకేజీకి చట్టభద్రత తెచ్చేద్దాం: బాబు నిర్దేశం

పార్లమెంటులో కూడా వైకాపా ఎంపీల పప్పులేమాత్రం ఉడకనివ్వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్రాలు సరిగా స్పందించకుంటే మరి కొద్ది నెలల్లో వైకాపా ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని ఆ పార్టీ

Webdunia
మంగళవారం, 31 జనవరి 2017 (00:40 IST)
పార్లమెంటులో కూడా వైకాపా ఎంపీల పప్పులేమాత్రం ఉడకనివ్వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర రాష్ట్రాలు సరిగా స్పందించకుంటే మరి కొద్ది నెలల్లో వైకాపా ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తారని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ హెచ్చరించిన నేపధ్యంలో ఈ దఫా పార్లమెంట్ సమావేశాల్లో ఆ పార్టీ దూకుడును అడ్డుకోవడమే తెలుగుదేశం పార్టీ తక్షణ కర్తవ్యంగా మారిపోయింది. 
 
ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ ఎంపీల రాజీనామా విషయం చర్చకు వచ్చింది. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ ఎంపీలు రాజీనామా చేయకముందే.. ప్యాకేజీకి చట్ట భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. 
 
అవసరమైతే ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని, ఢిల్లీకి కూడా వచ్చి మాట్లాడుతానని చంద్రబాబు ఎంపీలతో చెప్పారు. ప్యాకేజీకి చట్ట భద్రత కల్పించేలా టీడీపీ ఎంపీలు పోరాడాలని సూచించారు. ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ సీపీ ఎంపీల పోరాటాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు పార్టీ ఎంపీలను ఆదేశించారు.
 
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై శతవిధాలా పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనకుండా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకోగా.. పార్లమెంట్లో కూడా ప్రత్యేక హోదాపై ఆ పార్టీ ఎంపీలు చేసే పోరాటాన్ని అడ్డుకోవాలని టీడీపీ ఎంపీలకు సూచించినట్టు తెలుస్తోంది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ నష్టాలను రామ్ చరణ్ రికవరీ చేస్తున్నాడా?

రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా సంహారం

నా లైఫ్‌లో తండేల్ అల్లు అరవింద్ గారే : అక్కినేని నాగచైతన్య

అంత ఫాస్ట్‌గా డ్యాన్స్ చేయకండి బాబూ... మహేష్, ప్రభాస్, చెర్రీని అడుక్కున్న షారూఖ్

ఇక్కడ ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే: మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

ఆఫ్రికా హృదయం నుండి ఆయుర్వేద జ్ఞానం వరకు: మరువా x సరితా హండా

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments