Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ దే విజయం.. జ్యోతిష్యులు

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (10:48 IST)
ఈ దఫా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు గెలుస్తారని జ్యోతిష్కులు, న్యూమరాలజిస్టులు అంచనాలు వేస్తున్నారు.

లైఫ్‌ పాత్‌ నంబర్, మాస్టర్‌ ఇయర్‌ ఆధారంగా ట్రంప్‌ విజయం ఖాయమని జ్యోతిష్కులు భావిస్తున్నట్లు యాహూ న్యూస్‌ తెలిపింది. న్యూమరాలజిస్టులు లైఫ్‌ పాత్‌ నంబర్, మాస్టర్‌ ఇయర్‌ ఆధారంగా జాతకాలు చెబుతారు.
 
లైఫ్‌పాత్‌ నంబర్‌ అంచనా
ఒక వ్యక్తి జన్మతేదీలో అంకెలను ఒక ప్రత్యేక పద్ధతిలో కూడడం ద్వారా లైఫ్‌పాత్‌ నంబర్‌ను నిర్ణయిస్తారు. దీన్ని డెస్టినీ నంబర్‌ అనికూడా అంటారు. ట్రంప్‌ బర్త్‌డేట్‌: 14–06–1946. ఇందులో అంకెలను ప్రత్యేక పద్ధతిలో కూడితే 22 వస్తుంది. ఇది ట్రంప్‌ లైఫ్‌పాత్‌ నంబర్‌. ఈ నెంబర్‌ వచ్చిన వ్యక్తులు మాస్టర్‌ బిల్డర్స్‌ అని న్యూమరాలజిస్టులు చెబుతున్నారు.

వీరివన్నీ భారీ ప్రణాళికలు, భారీ విజయాలని, వీరికి ఆత్మ విశ్వాసం ఎక్కువని తెలిపారు. వ్యాపారం, రాజకీయాల్లో ఈ నంబరున్న వ్యక్తులు బాగా రాణిస్తారన్నారు. ఇక జోబైడెన్‌ బర్త్‌డేట్‌: 20–11–1942. ఇందులో అంకెలను ప్రత్యేక పద్దతిలో కూడితే 2 వస్తుంది.

ఇది అత్యంత తక్కువ శక్తి ఉన్న నంబరని, ఈ నంబరు వ్యక్తులు ఎంత పనిచేసినా గుర్తింపు పొందలేరని నిపుణులు విశ్లేషించారు. ఇక ఎన్నికలు జరిగే 2020 సంవత్సరాన్ని చూస్తే ఇది ట్రంప్‌కు మాస్టర్‌ ఇయర్‌ అని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments