Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 31 March 2025
webdunia

నాకు నేనే సూపర్‌ మ్యాన్‌ను: ట్రంప్‌

Advertiesment
Superman
, గురువారం, 15 అక్టోబరు 2020 (08:40 IST)
కరోనా వైరస్‌ చికిత్స తీసుకున్నాక తనకి తానే ఒక సూపర్‌ మ్యాన్‌లా అనిపిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఆ చికిత్సతో రోగ నిరోధక శక్తి పెరిగి తనలో శక్తి బాగా పుంజుకుందని అన్నారు.

కరోనా నెగెటివ్‌ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన పెన్సిల్వేనియా ఎన్నికల సభలో తన మద్దతుదారులనుద్దేశించి మాట్లాడారు. తనకు చికిత్స అందించిన వైద్యులకు ధన్యవాదాలు చెప్పారు.
 
‘‘కరోనా సోకిన తర్వాత నాకు ఇచ్చిన మందులు అద్భుతంగా పని చేశాయి. అవేవో యాంటీ బాడీస్‌ చికిత్స అనుకుంటాను. నాకు సరిగ్గా తెలీదు. అది తీసుకున్నాక నా ఆరోగ్యం చాలా మెరుగుపడింది. నాకు నేనే ఒక సూపర్‌ మ్యాన్‌లా అనిపిస్తున్నాను’’ అని ట్రంప్‌ చెప్పారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యులు అమెరికాలో వాల్టర్‌ రీడ్‌ ఆస్పత్రిలో ఉన్నారని ఆయన కొనియాడారు. తనకు ఎంతటి శక్తి వచ్చిందంటే ఈ సభలో ఉన్న అందరినీ ముద్దాడగలనని అంటూ చమత్కరించారు.
 
ట్రంప్‌ క్వారంటైన్‌ సమయం ముగియ కుండానే బయటకి వచ్చారన్న విమర్శలకి ఆయన బదులిస్తూ ‘‘కావాలంటే నేను కూడా వైట్‌హౌస్‌లో ఒక మూల గదిలో కూర్చోవచ్చు. కానీ నేను అలా చెయ్యలేను. ఎందుకంటే నేను ఈ దేశానికి అధ్యక్షుడిని. నేను ప్రజల్ని కలుసుకోవాలి. వారితో మాట్లాడాలి. అందుకే నేను అలా శ్వేత సౌధానికే పరిమితమవలేకపోయాను’’ అని ఆ ఎన్నికల సభలో ట్రంప్‌ అన్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ కంటే ట్రంప్‌ బాగా వెనుకబడి ఉన్నారని సర్వేలు చెబుతూ ఉండడంతో ట్రంప్‌ ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి వెలంపల్లికి తీవ్ర అనారోగ్యం.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు