Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంత్రి వెలంపల్లికి తీవ్ర అనారోగ్యం.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు

Advertiesment
Minister Velampalli
, గురువారం, 15 అక్టోబరు 2020 (08:36 IST)
కరోనా నుంచి కోలుకున్న ఏపీ దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మరోమారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అత్యవసర చికిత్స కోసం ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడి అపోలో ఆస్పత్రిలో మంత్రి చికిత్స పొందుతున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.

మంత్రి వెలంపల్లికి కరోనా తిరగబెట్టిందని తెలిసింది. గత నెలలో మంత్రి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళ్లిన సీఎం జగన్‌, సహచర మంత్రులు, వైసీపీ నేతలు, అధికారులతో కలివిడిగా మెలిగారు.

ఆ తర్వాత ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో తిరుమల నుంచి తిరిగొచ్చి విజయవాడలోని ప్రైవేటు ఆస్పతిల్రో వారం రోజులకు పైగా చికిత్స తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక ఈనెల 8న విజయవాడలోని పాఠశాల విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ పంపిణీ చేశారు.

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 17 నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 21న మూలానక్షత్రం రోజున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాలని కోరుతూ 2 రోజుల క్రితమే దుర్గగుడి అధికారులతో కలిసి మంత్రి కూడా సీఎం జగన్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ వర్షానికి సెల్లార్‌లోకి చేరిన వర్షపు నీరు... వైద్యుడు మృతి.. ఎలా?