Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్ఆర్సిపి తోనే ఆర్యవైశ్యల అభివృద్ధి: మంత్రి వెలంపల్లి

Advertiesment
వైఎస్ఆర్సిపి తోనే ఆర్యవైశ్యల అభివృద్ధి: మంత్రి వెలంపల్లి
, గురువారం, 30 జనవరి 2020 (08:10 IST)
వైశ్య భవన్ ద్వారా భవిష్యత్తు సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని వైశ్య భవన్ ట్రస్టీ లకు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రావు సూచించారు.
 
బుధవారం హనుమాన్ పేట నంబర్ వారి వీధి నందు నూతన వైశ్య భవన్ ట్రస్ట్  ను మంత్రి, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తో కలిసి ప్రారంభించారు..
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య అభివృద్ధికి భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వ పథకాలను ట్రస్టు ద్వారా తెలుసుకునేందుకు ట్రస్ట్ భవన్ దోహదపడుతుందన్నారు...
 
వైశ్య భవన్ ట్రస్టీల 16 మందిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. అందరి సహకారంతో ఆర్య వైశ్య సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
 
కార్యక్రమంలో వైశ్య భవన్ ట్రస్టీలు చైర్మన్ పెనుగొండ సుబ్బారాయుడు, ప్రధాన కార్యదర్శి కొనకళ్ళ విద్యాధరరావు, కోశాధికారి శ్రీనివాసరావు, చలవాది మల్లికార్జున రావు, దుర్గా వెంకట ప్రసాదరావు, కొత్తమాసు వెంకటేశ్వరరావు, వీర వెంకట రామకృష్ణారావు, వెంకటేశ్వర గుప్త, లింగమల్ల శ్రీనివాసరావు, వాసుదేవరావు, గుడిపాటి పాపారావు, కృష్ణ కిషోర్, చింతలపూడి శ్రీనివాసరావు, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజీనామా చేస్తానంటున్న వైకాపా ఎమ్మెల్యే.. రాజధాని కోసం కాదట...