Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌కు ట్రంప్ షాక్.. ఒబామా ఇచ్చిన ఆర్థిక సాయాన్ని ''లోన్''గా మార్చేసారు..

పాకిస్థాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపించారు. ఉగ్రవాదంపై పోరులో భాగంగా గతంలో బరాక్ ఒబామా సర్కారుకు పాకిస్థాన్‌కు ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని ట్రంప్ అప్పుగా మార్చేస్తూ కీలక ప్రకటన

Webdunia
మంగళవారం, 23 మే 2017 (16:06 IST)
పాకిస్థాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపించారు. ఉగ్రవాదంపై పోరులో భాగంగా గతంలో బరాక్ ఒబామా సర్కారుకు పాకిస్థాన్‌కు ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని ట్రంప్ అప్పుగా మార్చేస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ట్రంప్ తొలి బడ్జెట్‌లో తగిన మార్పులు చేయాలంటూ అమెరికా కాంగ్రెస్‌కు సిఫారసు చేశారు. అయితే ఇది కార్యరూపం దాల్చేందుకు సమయం పడుతుందని ట్రంప్ తెలిపారు. 
 
పాకిస్థాన్‌కు ఇచ్చిన ఆర్థిక సాయాన్ని లోన్‌గా మార్చుకున్న ట్రంప్.. ఇజ్రాయేల్, ఈజిప్టు వంటి దేశాలకు చేస్తున్న ఆర్థిక సాయానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. అమెరికా మిలటరీ విదేశాలకు వెచ్చిస్తున్న సాయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ సర్కారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 
 
కాగా ఉగ్రవాదంపై పోరాడేందుకు ఆయుధాల కొనుగోలు కోసం పాకిస్థాన్‌కు ఒబామా సర్కారు భారీ ప్యాకేజీని సాయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ఆర్థిక సాయాలే అమెరికా కొంపముంచుతున్నాయని.. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేసిన ట్రంప్.. అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలను నిజం చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments