Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికి రాగానే ల్యాప్ టాప్‌లో భర్త ఛాటింగ్.. భార్య నిలదీస్తే ఇంటి నుంచి పరార్.. ఏం చేశారంటే?

గృహహింస నిరోధించేందుకు చట్టాలు వచ్చేస్తున్నాయి. గృహ హింసను ఏమాత్రం భరించాల్సిన అవసరం లేదని.. ధైర్యంగా ఫిర్యాదు చేయాలని గృహహింస నిరోధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. భర్త, అత్తమామల వేధింపులు ఎక్కువైతే మ

Webdunia
మంగళవారం, 23 మే 2017 (15:15 IST)
గృహహింస నిరోధించేందుకు చట్టాలు వచ్చేస్తున్నాయి. గృహ హింసను ఏమాత్రం భరించాల్సిన అవసరం లేదని.. ధైర్యంగా ఫిర్యాదు చేయాలని గృహహింస నిరోధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. భర్త, అత్తమామల వేధింపులు ఎక్కువైతే మహిళలు భరించాల్సిన అవసరం లేదని, అలాగే భరణం ఇవ్వమని, విడాకులిస్తామని బెదిరించిన వారిపై ఫిర్యాదు చేయాలని పిలుపునిస్తున్నారు. 
 
ఈ క్రమంలో 2016లో 515 కేసులు నమోదైనాయి. ఇందులో 40 కేసులు రాజీకొచ్చాయి. 50 మంది కోర్టు సమక్షంలో రాజీ కుదుర్చుకున్నారు. తీర్పును ధిక్కరించిన 40 మంది జైలు జీవనం గడుపుతున్నారని గృహ హింస నిరోధక అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కేసుల పెండింగ్‌ను పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన ఓ సంపన్న కుటుంబానికి చెందిన మహిళకు కోర్టు అనుకూలంగా తీర్పు నిచ్చిందని గృహ హింస నిరోధక శాఖాధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌కు చెందిన రవళికి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రవితో వివాహమైంది. దంపతులు మూడేళ్లు అన్యోన్యంగా ఉన్నారు. తర్వాత ఆఫీసు నుంచి రాగానే ల్యాప్‌టాప్ ముందేసుకునేవాడు. 
 
ఫేస్‌బుక్‌లో చాటింగ్‌కే రవి చాలా సమయం కేటాయించేవాడు. భార్యను ఏమాత్రం పట్టించుకునే వాడు కాదు. దీంతో రవళి భర్తను నిలదీయడంతో అతడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. రవిని సంప్రదిస్తే ఆతడి ఫోన్ స్విచ్ఛాప్ అయ్యింది. ఇక చేసేది లేక రవళి తల్లిదండ్రులు రవి తల్లిదండ్రులతో మాట్లాడారు. రవికి రవళి నచ్చలేదన్నారు. దీంతో విస్తుపోయిన రవళి తండ్రి గృహహింస నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తానిచ్చిన కట్నం, ఆభరణాలు వెనక్కి ఇవ్వడంతో పాటు తమ అమ్మాయికి చట్ట ప్రకారం భరణం వచ్చేలా చూడాలని కేసు నమోదు చేశారు. 
 
ఫిర్యాదు తీసుకున్న అధికారులు పరిశీలన అనంతరం కోర్టు ముందు వారిని ప్రవేశపెట్టారు. అన్ని ఆధారాలనూ కోర్టుకు అందించారు. చివరికి కోర్టు రవళికి అనుకూలంగా తీర్పిచ్చింది. భరణం చెల్లించాల్సిందేనని సూచించింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments