Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాద పోషక దేశంగా ఉత్తర కొరియాను ప్రకటిస్తున్నాం: ట్రంప్

ఉత్తర కొరియాను ఉగ్రవాదులను పోషిస్తున్న దేశంగా అమెరికా ప్రకటించింది. ప్రపంచం మొత్తుకుంటున్నా.. ఐరాస చెప్తున్నా.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వారానికో క్షిపణి పరీక్ష నిర్వహిస్తున్న ఉత్తర కొరియాపై ఇప్పటికే

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (10:23 IST)
ఉత్తర కొరియాను ఉగ్రవాదులను పోషిస్తున్న దేశంగా అమెరికా ప్రకటించింది. ప్రపంచం మొత్తుకుంటున్నా.. ఐరాస చెప్తున్నా.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వారానికో క్షిపణి పరీక్ష నిర్వహిస్తున్న ఉత్తర కొరియాపై ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణులను పరీక్షించిన నార్త్ కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ మరిన్ని పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాను ఉగ్రవాద పోషక దేశంగా ప్రకటించిన అమెరికా మరిన్ని ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమైంది. ఉత్తర కొరియాను ఉగ్రవాద పోషక దేశంగా ప్రకటిస్తున్నామని.. చాలా ఏళ్ల క్రితమే ఈ పని చేసి వుండాలని వైట్ హౌస్‌లో ట్రంప్ ప్రకటించారు. అణ్వస్త్ర పరీక్షలతో ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
 
మరోవైపు ఈ ఏడాది మలేషియా విమానాశ్రయంలో కిమ్ జోంగ్ సోదరుడు హత్యకు గురయ్యారు. ఈ ఘటన వెనక కిమ్ హస్తం ఉన్నట్టు అమెరికా ఆరోపించింది. నార్త్ కొరియా చట్టబద్ధంగా నడుచుకోవాలని, అణ్వస్త్ర పరీక్షలకు స్వస్తి చెప్పాలని, అంతర్జాతీయంగా ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే చర్యలను మానుకోవాలని ట్రంప్ హెచ్చరించినట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments