Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

నేనెప్పుడైనా కొవ్వెక్కిన పొట్టోడు అన్నానా?: కిమ్ జాంగ్‌పై ట్రంప్ ఫైర్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్నమొన్నటి వరకు ప్రకటనలకు మాత్రమే పరిమితమైన ఈ యుద్ధం ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగారు.

Advertiesment
Donald Trump
, ఆదివారం, 12 నవంబరు 2017 (15:39 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్నమొన్నటి వరకు ప్రకటనలకు మాత్రమే పరిమితమైన ఈ యుద్ధం ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగారు. ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ తొమ్మి రోజుల పాటు ఆసియా దేశాల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనపై కిమ్ జాంగ్ ఉన్ స్పందిస్తూ, 'ట్రంప్‌ వృద్ధుడు, ఆయన వల్ల ఏమవుతుంది?' అంటూ ఎద్దేవా చేశారు.
 
దీనికి ట్రంప్ ధీటుగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన ఆయన ‘నన్ను వృద్ధుడంటూ కిమ్ ఎందుకలా అవమానపరుస్తాడు? అసలు నేను ఎప్పుడన్నా కిమ్‌ పొట్టిగా, లావుగా ఉన్నాడు అని అన్నానా? అతనికి స్నేహితుడిగా వుండాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాను కదా.. ఏదో ఒక రోజు అలా అవుతుంది కూడా..’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ పొల్యూషన్ : బేసి - సరి విధానానికి ఎన్జీటీ బ్రేక్