Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔను... వాళ్లిద్దరూ కలుస్తున్నారు.. వేదిక సింగపూర్.. ముహుర్తం జూన్ 12...

అమెరికా - ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహ సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేవనుంది. నిన్నామొన్నటివరకు ఒకరిపై ఒకరు కారాలుమిరియాలు నూరుకుంటూ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసిన ఇరు దేశాల అధ్యక్షులు జూన్

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (12:13 IST)
అమెరికా - ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహ సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేవనుంది. నిన్నామొన్నటివరకు ఒకరిపై ఒకరు కారాలుమిరియాలు నూరుకుంటూ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసిన ఇరు దేశాల అధ్యక్షులు జూన్ 12వ తేదీన సమావేశం కానున్నారు. వీరిద్దరూ సింగపూర్‌లో భేటీకానున్నారు. ప్రపంచ శాంతి కోసం తాము కలసి పని చేస్తామని ప్రకటించారు.
 
వింటర్ ఒలింపిక్స్ తర్వాత అమెరికా, ఉత్తర కొరియా మధ్య పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఈ మధ్యే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ డోనాల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. తర్వాతే ట్రంప్ - కిమ్ భేటీపై క్లారిటీ వచ్చింది. అటు అమెరికా.. ఇటు ఉత్తరకొరియాలో కాకుండా మధ్యలో సింగపూర్‌లో భేటీ కావాలని ట్రంప్ - కిమ్‌లు నిర్ణయించడం గమనార్హం. 
 
నిజానికి రెండు నెలల క్రితం వరకు కిమ్.. ట్రంప్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగింది. క్షిపణి ప్రయోగాలు, అణ్వస్త్ర పరీక్షలతో అమెరికాను భయపెట్టే చర్యలో కిమ్ నిమగ్నమైపోయారు. ఖండాంతర క్షిపణులతో హవాయ్ ద్వీపంపై దాడి చేస్తామంటూ హెచ్చరించారు. ఇటు ట్రంప్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ కావడంతో రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చైనా, దక్షిణకొరియా దేశాల జోక్యంతో వెనక్కి తగ్గారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments