నిన్న చైనా.. ఇప్పుడు భారత్,రష్యాలపై దుమ్మెత్తి పోసిన ట్రంప్

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (07:48 IST)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతే.. ఆయన మారరుగాక మారరు. ఆ దేశంలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆయన చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. నిన్నటి వరకు చైనాపై చిందులేసిన ఆయన.. ఇప్పుడు రష్యా, భారత్ పైనా దుమ్మెత్తి పోస్తున్నారు.
 
భారత్‌, చైనా, రష్యాలు వెలువరించే కర్బన ఉద్గారాల గురించి ఎలాంటి రక్షణ తీసుకోలేదని నిందించారు. అమెరికా చేసినంత కూడా ఈ దేశాలు చేయలేదని, పైగా లెక్కలేనన్ని పరిమితులు విధిస్తారని, అందుకే పారిస్‌ వాతావారణ ఒప్పందం నుంచి తాము వైదొలిగామని ట్రంప్‌ చెప్పారు.

టెక్సాస్‌లోని మిడ్‌ల్యాండ్‌లో సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే డెమొక్రాట్లపై విమర్శలు కూడా చేశారు. ఈ పిచ్చి డెమోక్రాట్లు లెక్కలేనన్ని అమెరికా ఉద్యోగాలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలను చైనాకు తరలిస్తారని విమర్శించారు.

'మన గాలి గురించి మనం శ్రద్ధ తీసుకోవాలని వారు కోరుకుంటారు. కానీ చైనా తన గాలి గురించి శ్రద్ధ తీసుకోదు. భారత్‌ తన గాలి గురించి శ్రద్ధ తీసుకోదు. రష్యా కూడా శ్రద్ధ తీసుకోదు. కానీ, మనం చేయాలి' అని ట్రంప్‌ అన్నారు. తాను అధికారంలోకి ఉన్నంత వరకూ అమెరికాను అగ్రస్థానంలో ఉంచుతానని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments