Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ అమెరికా అధ్యక్షుడవుతాడని చెప్పిన చైనా కోతికి సన్మానం...

చైనా కోతి చెప్పిన జోస్యం నిజమైంది. గతంలో అక్టోపస్ పాల్ జోస్యం చెప్పినట్టుగానే ఈ కోతి కూడా జోస్యం చెప్పింది. అక్టోపస్ పాల్ 2010 ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో అంతిమ విజేత ఎవరో ముందుగానే జోస్యం చెప్పింది. అలాగే, చైనా కోతి కూడా ఇపుడు అమెరికా అధ్యక్షుడు ఎవరో జోస

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (15:37 IST)
చైనా కోతి చెప్పిన జోస్యం నిజమైంది. గతంలో అక్టోపస్ పాల్ జోస్యం చెప్పినట్టుగానే ఈ కోతి కూడా జోస్యం చెప్పింది. అక్టోపస్ పాల్ 2010 ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో అంతిమ విజేత ఎవరో ముందుగానే జోస్యం చెప్పింది. అలాగే, చైనా కోతి కూడా ఇపుడు అమెరికా అధ్యక్షుడు ఎవరో జోస్యం చెప్పింది. ఈ కోతి పేరు 'గెడా'. 
 
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడిన రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ల కటౌట్లను గెడా ముందు ఉంచారు. ఇద్దరి కటౌట్లను కాసేపు చాలా తీక్షణంగా చూసిన గెడా... చివరకు ట్రంప్ కటౌట్‌ను కౌగిలించుకుని, ఆయనకు ముద్దు పెట్టింది. ఈ రకంగా, ట్రంపే అంతిమ విజేత అని తేల్చేసింది.
 
మరో విషయం ఏమిటంటే... ఈ యేడాది జరిగిన యూరోపియన్ సాకర్ ఛాంపియన్ షిప్‌లో కూడా విజేత ఎవరో గెడా ముందుగానే చెప్పింది. ఛాంపియన్‌గా పోర్చుగల్ గెలుస్తుందని గెడా చెప్పిన జోస్యం నిజమైంది. ఇప్పుడు ట్రంప్ విషయంలోనూ నిజమైంది. ఈ వార్త తెలుసుకున్న ట్రంప్ మద్దతుదారులు ఆ కోతికి సన్మానం చేయాలనుకుంటున్నారట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments