Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దుతో నరేంద్ర మోడీ అలాంటి వారి నడ్డి విరిచారు: కైలాశ్ సత్యార్థి

నోట్ల రద్దుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి స్వాగతించారు. ప్రధాని తీసుకున్న నిర్ణయానికి తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. 2016 గ్లోబల్ ఇండెక్

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (15:24 IST)
నోట్ల రద్దుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని నోబెల్ బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి స్వాగతించారు. ప్రధాని తీసుకున్న నిర్ణయానికి తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. 2016 గ్లోబల్ ఇండెక్స్ సర్వే ప్రకారం అక్రమ రవాణాకి గురై ప్రపంచంలో బానిసలుగా మారిన దాదాపు 46 మిలియన్ల మందిలో 40 శాతం మంది భారతీయులేనని కైలాశ్ వెల్లడించారు.

చిన్న పిల్లలు, మహిళల అక్రమ తరలింపు వంటి దురాగతాలకు నల్లధనాన్ని ప్రధాన వనరుగా ఉపయోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే మోడీ నిర్ణయం ద్వారా వారి నడ్డి విరిచిందన్నారు. అక్రమంగా డబ్బు సంపాదించిన వారికి మోడీ సరైన పద్ధతిలో బుద్ధి చెప్పారన్నారు. 
 
మధ్యవర్తులు, బ్రోకర్లు ఓ బాలుడిని పనిలో పెడితే రూ.5000, అదే ఒక బాలికని పనిలో పెడితే రూ.2,00,000 దాకా కమిషన్‌ తీసుకోవటం తాను  చాలా సార్లు తన కళ్లారా చూశానని.. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. 
 
కైలాశ్‌ సత్యార్థి బాలల హక్కుల కోసం పోరాడారు. భారత దేశంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆయన చేపట్టిన 'బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌' ద్వారా దాదాపు 80,000 మంది బాలకార్మికులను కాపాడారు. ఇందుకు గాను ఆయనకు 2014లో నోబెల్‌ బహుమతి లభించిన సంగతి తెలిసిందే.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments