Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా సైన్యం అండ లేకపోతే.. సౌదీ రాజు 2 వారాలు కూడా..?: డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోటికి పని చెప్పారు. అమెరికా సైన్యం అండ లేకపోతే.. రెండు వారాలు కూడా అధికారంలో కొనసాగలేరంటూ సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చే

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (12:50 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోటికి పని చెప్పారు. అమెరికా సైన్యం అండ లేకపోతే.. రెండు వారాలు కూడా అధికారంలో కొనసాగలేరంటూ సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 
 
తాము సౌదీని రక్షిస్తున్నామని.. సౌదీ రాజు సల్మాన్ అంటే తమకు చాలా ఇష్టం. మిమ్మల్ని తాము రక్షిస్తున్నామని సల్మాన్‌కు చెప్పానని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాము లేకుండా మీరు రెండు వారాలు కూడా ఉండలేరని తెలిపానని గుర్తు చేశారు. దీనికి ప్రతిఫలంగా తమ మిలిటరీకి మీరు చెల్లింపులు చేయాలని చెప్పానని ట్రంప్ తెలిపారు.
 
తన తొలి విదేశీ పర్యటనకు వెళ్లిన ట్రంప్ ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చమురు ఎగుమతుల్లో సౌదీ అరేబియానే తొలి స్థానంలో వుంది. అయితే, చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో, సౌదీపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. 
 
చమురు మార్కెట్ ఒడిదొడుకులకులోను కాకుండా స్థిరంగా ఉండేలా సౌదీ చర్యలు చేపట్టాలని... ఇందులో భాగంగా చమురు సరఫరాను ఎప్పటిలాగానే స్థిరంగా కొనసాగించాలని తెలిపారు. చమురు ధరలన పెంచడాన్ని వారు ఆపేయాలని తాము కోరుతున్నామని తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments