Webdunia - Bharat's app for daily news and videos

Install App

824 యేళ్ల క్రితం నలందలో చదువుకున్నా... నాది పునర్జన్మ.. భూటాన్ యువరాజు గతజన్మ స్మృతులు

భూటాన్ యువరాజు పేరు జిగ్మి జితెన్ వాంగ్‌చుక్. వయస్సు మూడేళ్లు. ఈ బుడతడు 824 సంవత్సరాల తర్వాత పునర్జన్మ ఎత్తినట్టు చెపుతున్నాడు. పైగా.. బీహార్‌లోని నలందలో విద్యాభ్యాసం చేశాడు. నాటి భవన సముదాయాలు పూర్తి

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (12:56 IST)
భూటాన్ యువరాజు పేరు జిగ్మి జితెన్ వాంగ్‌చుక్. వయస్సు మూడేళ్లు. ఈ బుడతడు 824 సంవత్సరాల తర్వాత పునర్జన్మ ఎత్తినట్టు చెపుతున్నాడు. పైగా.. బీహార్‌లోని నలందలో విద్యాభ్యాసం చేశాడు. నాటి భవన సముదాయాలు పూర్తిగా ధ్వంసమైపోయినట్టు ఈ యువరాజు చెపుతున్నాడు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం బీహార్ పర్యటనకు వచ్చిన భూటాన్ రాజమాత దోజీ వాంగ్‌చుక్ చెప్పుకొచ్చింది. 
 
దీనిపై రాజమాత స్పందిస్తూ.. "పునర్జన్మలో మా మనవడు పుట్టాడు. ఆయన ఇక్కడే చదువుకున్నాడని మేం నమ్ముతున్నాం. ఈ పరిసరాలను ఆయన గుర్తు పట్టాడు. ఇక్కడి కట్టడాలు శిథిలమైపోయాయని అంటుంటే నమ్ముతున్నాం" అని ఆమె పేర్కొన్నారు. 
 
తన మనవడితో కలసి భారత పర్యటనకు వచ్చిన ఆమె, నలంద ప్రాంతంలో మనవడు చెబుతున్న వందల ఏళ్ల నాటి సంగతులను మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ విషయాలను విని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతుండగా, ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
 
తాను 824 ఏళ్ల తర్వాత పునర్జన్మ పొందానని, గతంలో ఇక్కడే చదువుకున్నానని చెబుతూ, అక్కడి భోజనశాల, తరగతులు, హాస్టల్ ఎక్కడున్నాయో చూపుతున్నాడీ బుడతడు. వాళ్లమ్మతో భారత పర్యటనకు వచ్చి తన పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటున్న ఈ చిన్నారిని చూస్తే నిజమే అనిపించక మానదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments