Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలంబియాలో ముగ్గురు పురుషుల పెళ్ళికి చట్టబద్ధత: నటుడు-జర్నలిస్ట్-స్పోర్ట్స్‌‌ఇన్‌స్ట్రక్టర్ ఏకమయ్యారు..

కొలంబియాలో స్వలింగ సంపర్కుల వివాహానికి గత ఏడాది ఏప్రిల్ నెలలో అధికారికంగా అనుమతులు లభించిన నేపథ్యంలో.. తాజాగా ఏకంగా ముగ్గురు పురుషుల పెళ్ళికి చట్టబద్ధత కల్పించింది. వివరాల్లోకి వెళితే ముగ్గురు పురుషుల

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (11:48 IST)
కొలంబియాలో స్వలింగ సంపర్కుల వివాహానికి గత ఏడాది ఏప్రిల్ నెలలో అధికారికంగా అనుమతులు లభించిన నేపథ్యంలో.. తాజాగా ఏకంగా ముగ్గురు పురుషుల పెళ్ళికి చట్టబద్ధత కల్పించింది. వివరాల్లోకి వెళితే ముగ్గురు పురుషులు పెళ్లి చేసుకుని పాలియామరస్ ఫ్యామిలీగా ఆవిర్భవించారు. వీరిలో ఓ నటుడు కూడా వుండటం గమనార్హం. దీనికి సంబంధించి కొలంబియా మీడియాలో వెలువడిన ఒక వీడియోలో నటుడు విక్టర్ హుగో ప్రాడా మాట్లాడాడు. 
 
ముగ్గురు పురుషుల్లో ఒకడైన హుగో ప్రాడా మాట్లాడుతూ... తాము మా వైవాహిక జీవితానికి అధికారిక గుర్తింపు కోరుకుంటున్నామని, మా హక్కులను మేము కాపాడుకోవాలని భావిస్తున్నామని తెలిపాడు. తన జీవిత భాగస్వాములుగా స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్ జాన్ అలెజాండ్రో రోడ్రిగూ, జర్నలిస్టు మాన్యూల్ జోన్ బెర్మాముండేజ్ ఉంటారని పేర్కొన్నాడు.
 
తమ వివాహానికి సంబంధించిన లీగల్ పేపర్లపై మెడిలిన్ నగరానికి చెందిన అధికారి సమక్షంలో సంతకాలు జరిగాయని తెలిపాడు. ఇకపై తమ ఫ్యామిలీ యూనిట్‌కు న్యాయపరమైన గుర్తింపు లభించిందన్నారు. తద్వారా ప్రపంచంలోనే తమదే తొలి పాలియామర్ ఫ్యామిలీ అని పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments