Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీసా మోసం కేసులో దోషులుగా ముగ్గురు భారతీయులు...

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (10:31 IST)
అమెరికాలో హెచ్1బీ వీసాల మోసం కేసులో ముగ్గురు భారతీయులకు జైలుశిక్షకు గురయ్యారు. ఈ సంఘటన అమెరికాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, శాంతా క్లారాలో నివిసించే కిషోర్ ద‌త్త‌పురం, టెక్సాస్‌లో నివసించే కుమార్ అశ్వ‌ప‌తి, శాన్ జోస్‌కు చెందిన సంతోష్ గిరిలు నానోసిమాంటిక్స్ కంపెనీ పేరుతో ఓ క‌న్స‌ల్టెన్సీ నడిపిస్తున్నారు.
 
వ‌ర్క‌ర్ల కోసం నకిలీ హెచ్‌-1బీ వీసాల‌ను వీళ్లు జారీ చేశారు. ఉద్యోగాలు లేని వాళ్లకు కూడా వీళ్లు వీసాల‌ను ఇచ్చారు. అయితే వీసా దరఖాస్తులో భాగంగా ఐ-129 అనే పిటిషన్‌‌ను అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్‌ విభాగానికి సమర్పించాల్సి ఉంటుంది. అందులో అభ్యర్థి చేయబోయే ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలి.
 
అయితే ఈ ముగ్గురు భారతీయులులేని ఉద్యోగాల్ని ఉన్నట్లుగా చూపించి లాభం పొందాలని చూశారని అక్కడి పోలీసులు కోర్టుకు సమర్పించిన దస్త్రాల్లో పేర్కొన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి థర్డ్‌ పార్టీలను కూడా వాళ్లు ఆశ్రయించినట్లు పోలీసులు కోర్టుకి తెలియజేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు బెయిల్‌పై బయటకు వచ్చారు. తదుపరి విచారణ నిమిత్తం మే 13వ తేదీన కోర్టులో హాజరుకానున్నారు. ఈ కేసులో దోషులుగా తేలితే పది సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశముంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments