Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లోకి 450మంది టెర్రరిస్టులు? అమర్‌నాథ్‌ యాత్రను లక్ష్యంగా?

జమ్మూకాశ్మీర్‌లోకి చొరబడేందుకు 450మంది టెర్రరిస్టులు వేచి చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నియంత్రణ రేఖ వద్ద వివిధ లాంచ్ ప్యాడ్స్ వద్ద కనీసం 450 మంది పాకిస్థాన్ టెర్రరిస్టులు వేచి

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (16:11 IST)
జమ్మూకాశ్మీర్‌లోకి చొరబడేందుకు 450మంది టెర్రరిస్టులు వేచి చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. నియంత్రణ రేఖ వద్ద వివిధ లాంచ్ ప్యాడ్స్ వద్ద కనీసం 450 మంది పాకిస్థాన్ టెర్రరిస్టులు వేచి చూస్తున్నారని నిఘా సంస్థలు వెల్లడించాయి. ఈ టెర్రరిస్టుల్లో హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా ఉగ్రవాదులు వున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 
 
జూన్ 28 నుంచి ప్రారంభమయ్యే అమర్‌ నాథ్ యాత్రను వీరు లక్ష్యంగా చేసుకున్నారని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. రంజాన్ మాసం సందర్భంగా తీవ్రవాద వ్యతిరేక దాడులకు భారత్ విరామం ప్రకటించిన నేపథ్యంలో.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఉగ్రవాద సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను జమ్మూకాశ్మీర్‌లోకి అడుగుపెట్టనీయకుండా భారత సైన్యం తగిన ఏర్పాట్లు చేస్తోంది. బందోబస్తును పటిష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments