Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ కోరుకుంటే.. మూడో దేశం కాశ్మీర్‌లో ప్రవేశించవచ్చు: చైనా కొత్త వాదన

డోక్లాం విషయంలో భారత్‌తో ఢీ అంటే ఢీ అంటూ హెచ్చరికలు చేస్తున్న చైనా కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. పాకిస్థాన్ కోరుకుంటే మూడో దేశం కాశ్మీర్‌లో ప్రవేశించవచ్చుననే కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే

Webdunia
సోమవారం, 10 జులై 2017 (09:10 IST)
డోక్లాం విషయంలో భారత్‌తో ఢీ అంటే ఢీ అంటూ హెచ్చరికలు చేస్తున్న చైనా కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. పాకిస్థాన్ కోరుకుంటే మూడో దేశం కాశ్మీర్‌లో ప్రవేశించవచ్చుననే కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే డోక్లాం విషయంలో చైనా హెచ్చరికలు చేస్తుంది. అయితే చైనా ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా భారత్ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో చైనాలో ప్రభుత్వ విధానాలకు నిర్దేశం చేస్తుందనే పేరున్న గ్లోబల్‌ టైమ్స్‌ పతిక్రలో సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ స్టడీస్‌ డైరెక్టర్‌ లాంగ్‌ జింగ్‌ చున్‌ అనే కాలమిస్టు సరికొత్త వాదనతో కాలమ్ రాశాడు.
 
అందులో ''సిక్కిం సెక్టార్‌‌లోని డోక్లాం ప్రాంతంలో చైనా మిలటరీ రోడ్డు నిర్మించకుండా భూటాన్‌ తరపున భారత్‌ వచ్చి అడ్డుకుంది. భారత్‌ చెబుతున్న దాని ప్రకారం భూటాన్ కోరింది కనుక చైనాను భారత్ అడ్డుకుంటోంది. భారత్‌ తర్కం ప్రకారం.. పాకిస్థాన్‌ అభ్యర్థిస్తే 'మూడో దేశం' కాశ్మీర్‌లో ప్రవేశించవచ్చునని చైనా కొత్త పాట పాడుతోంది. కాగా, డోక్లాం ప్రాంతంలో భారత సైన్యం టెంట్లు వేసి.. చైనా సైన్యానికి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments