Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చేవారం మరింత కఠినం .. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.. ట్రంప్ పిలుపు

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (17:01 IST)
కరోనా వైరస్ దెబ్బకు అమెరికా అల్లకల్లోలమైపోయింది. ముఖ్యంగా న్యూయార్క్ మహానగరం శవాల దిబ్బగా కనిపిస్తోది. కరోనా వైరస్ బారినపడి చనిపోతున్న వారిని ఖననం చేసేందుకు సరిపడ శ్మశానవాటికలు కూడా అందుబాటులో లేవు. దీంతో శవాలన్నీ ఆస్పత్రుల్లోని మార్చురీల్లో నిల్వచేశారు. పైగా, ఒక మృతదేహాల ఖననం కోసం శ్మశానవాటికల వద్ద వరుస క్రమం పాటిస్తున్నారు. దీంతో రెండు మూడు రోజులపాటు వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. అమెరికా చరిత్రలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ సంభవించలేదు. 
 
మరోవైపు, ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు పిడుగులాంటి వార్త చెప్పారు. రాబోయే రోజుల్లో మృతుల సంఖ్య పెరుగుతుందని జోస్యం చెప్పారు. చాలా క్లిష్టమైన వారం రోజుల సమయాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
'వచ్చే వారం రోజులు చాలా క్లిష్లమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా మరణాలు సంభవిస్తాయి' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, అత్యంత ప్రభావిత రాష్ట్రాలను ఆదుకుంటామని ట్రంప్ భరోసా ఇచ్చారు. వైద్య సదుపాయాలు కల్పిస్తూ, మిలిటరీ సేవలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వేలాది మంది సైనికలు, వైద్య నిపుణులు సాయం అందిస్తున్నారని చెప్పారు. న్యూయార్క్‌లో 1,000 మంది మిలిటరీ సిబ్బంది మోహరించారని తెలిపారు.
 
అదేసమయంలో ఈస్టర్‌ రోజున సామాజిక దూరం నిబంధనలను సడలిస్తామన్నారు. 'మన దేశాన్ని మళ్లీ తెరవాల్సిన అవసరం ఉంది' అని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాలో మూడు లక్షల మందికి పైగా ప్రజలకు కరోనా వైరస్ సోకింది. 8,500 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క శనివారం రోజునే 630 మంది ప్రాణాలు విడిచారు. దీన్నిబట్టే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments