Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడి చివరి కోరిక.. అమ్మ సమాధి పక్కనే పూడ్చిపెట్టండి.. స్వర్గంలో నన్ను బాగా..?

క్యాన్సర్ బారిన పడిన ఆ బాలుడు తన తల్లి సమాధి పక్కనే తనను పూడ్చి పెట్టాలన్నాడు. అలా చేస్తే స్వర్గంలో ఉన్న అమ్మ తనను బాగా చూసుకుంటుందని చెప్పాడు. ఈ మాట విన్న అనేక హృదయాలు కరిగిపోయాయి. బాలుడి చివరి కోరిక

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (18:08 IST)
అమ్మకు క్యాన్సర్.. బిడ్డను కూడా ఆ ప్రాణాంతక మహమ్మారి వదిలిపెట్టలేదు. అమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. అయితే బిడ్డ ఆమె వెంటే వెళ్లిపోయాడు. కేన్సర్‌కు చికిత్స పొందుతున్న లండన్‌లోని ఆస్పత్రిలో మృతి చెందిన ఏడేళ్ల బాలుడి చివరి కోరిక విని ప్రపంచం కన్నీళ్లు పెట్టుకుంది. శుక్రవారం అమ్మతో పాటు శాశ్వతంగా ఈ లోకానికి దూరమైన ఫిలిప్ క్వాస్ని అనే ఏడేళ్ల బాలుడు చివరి కోరిక ఏంటో వింటే కంట నీరు రాక తప్పదు. 
 
క్యాన్సర్ బారిన పడిన ఆ బాలుడు తన తల్లి సమాధి పక్కనే తనను పూడ్చి పెట్టాలన్నాడు. అలా చేస్తే స్వర్గంలో ఉన్న అమ్మ తనను బాగా చూసుకుంటుందని చెప్పాడు. ఈ మాట విన్న అనేక హృదయాలు కరిగిపోయాయి. బాలుడి చివరి కోరిక తీర్చేందుకు ప్రపంచం ముందుకొచ్చింది. 
 
2011తో ఫిలిప్ తల్లి  ఎజ్నియెస్కా కూడా కేన్సర్‌తోనే మృతి చెందారు. తండ్రి పీటర్‌తో కలిసి ఉంటున్న ఫిలిప్‌కు కేన్సర్ సోకినట్టు గతేడాది సెప్టెంబరులో గుర్తించారు. బాలుడికి సోకిన జువెనైల్‌ మైలోమోనోసైటిక్‌ ల్యుకేమియా(జేఎంఎంఎల్‌) నుంచి రక్షించేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే బాలుడి కోరిక తీర్చేందుకు 6500 పౌండ్లు అవసరం కాగా, దాతల ద్వారా 41వేల పౌండ్లు విరాళంగా అందాయి. 
 
చనిపోతాననే విషయం ఫిలిఫ్‌కు తెలుసునని.. తన చేతుల ద్వారా కుమారుడిని పూడ్చి పెట్టాల్సి వస్తుందని ఊహించలేకపోయానని పీటర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫిలిప్ చివరి కోరిక తీర్చేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments