Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజా నీతులు చెప్పినా బూతులు చెప్తున్నట్టేవుంది.. నాలుక చీరేస్తారు: బుద్ధా వెంకన్న

వైఎస్సార్ కాంగ్రెస్ నేత, నగరి ఎమ్మెల్యే రోజా నీతులు చెప్తుంటే కూడా బూతులు చెప్తున్నట్టే ఉందని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన బ

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (17:53 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ నేత, నగరి ఎమ్మెల్యే రోజా నీతులు చెప్తుంటే కూడా బూతులు చెప్తున్నట్టే ఉందని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన బుద్దా వెంకన్న.. ఏపీ సీఎం చంద్రబాబును శ్రీరాముడితో పోల్చేశారు. అలాంటి వ్యక్తిని రోజా ఏకవచనంతో పిలవడం తగదని హితవు పలికారు. చంద్రబాబు శ్రీరాముడైతే, రోజా శూర్పణఖ అని, రామాయణంలో, ఆమె ముక్కూ చెవులను కోశారని, ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు రోజా నాలుకను చీరేస్తారని హెచ్చరించారు.
 
మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాల్సిందిగా సీబీఐ కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశాన్ని ప్ర‌స్తావిస్తూ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర వైసీపీ స‌భ్యుల‌కు చుర‌క‌లంటించారు. సోమవారం స‌భ నుంచి జ‌గ‌న్ స‌హా వైసీపీ స‌భ్యులు ఉన్న‌ట్టుండి గొడ‌వ చేస్తూ ఎందుకు వెళ్లిపోయార‌నే విషయం తనకు తొలుత అర్థం కాలేదన్నారు. 
 
అయితే, వారు ఎందుకు వెళ్లిపోయారో త‌న‌కు ఇప్పుడు తెలిసింద‌ని, జ‌గ‌న్‌కి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాల‌ని సీబీఐ కోర్టులో సీబీఐ అధికారులు పిటిష‌న్ వేయ‌డంతోనే, ఆ వార్త తెలుసుకొని జగన్ ఆందోళ‌న‌గా వెళ్లిపోయార‌ని ఎద్దేవా చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లరి నరేశ్ కు బచ్చల మల్లి హిట్టా? ఫట్టా? బచ్చలమల్లి రివ్యూ

ముఫాసా ది లైన్ కింగ్ ఎలా వుందంటే... ముఫాసా రివ్యూ

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments