Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానయాన రంగంలో 100 శాతం పెట్టుబడులు? ఖతార్ నుంచి 100 కొత్త జెట్ లైనర్స్

భారత దేశంలో దేశీయ విమానయాన రంగంలో వందకు వంద శాతం విదేశీ పెట్టుబడులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనుమతి ఇస్తారనే నమ్మకంతో ఖతార్ ఎయిర్‌వేస్.. దాదాపు 100 కొత్త జెట్ లైనర్స్‌ను ఆర్డర్ చేయనుంది.

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (15:46 IST)
భారత దేశంలో దేశీయ విమానయాన రంగంలో వందకు వంద శాతం విదేశీ పెట్టుబడులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనుమతి ఇస్తారనే నమ్మకంతో ఖతార్ ఎయిర్‌వేస్.. దాదాపు 100 కొత్త జెట్ లైనర్స్‌ను ఆర్డర్ చేయనుంది. భారత్‌లో కొత్త ఎయిర్‌‍లైన్స్‌ను స్థాపించేందుకు అనుమతుల గురించి తెలుసుకుని టెండర్ వేస్తామని ఖతార్‌ ఎయిర్‌వేస్‌ సీఈఓ అల్‌ బకర్‌ తెలిపారు. ఈ ప్రక్రియ ఏడాదిలోనే పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. 
 
అలాగే భారత్‌లో విమానయాన సంస్థను స్థాపించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు అల్ బకర్ వెల్లడించారు. వంద విమానాలతో భారత్‌లో విమానయాన వ్యాపారంలో ప్రవేశిస్తామని ఆయన తెలిపారు. అయితే భారత స్వదేశీ విమానయానంలో విదేశీ ఎయిర్‍‌లైన్స్‌కు ఇప్పటికే వందశాతం పెట్టబడులకు ఛాన్స్ లేదు. కానీ భవిష్యత్తులో ఉంటుందనే ఆలోచనతోనే ఖతార్‌తో పాటు ఎయిర్‌‍లైన్స్ భారత్‌లో వ్యాపార విస్తరణకు సన్నాహాలు మొదలెట్టాయి.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments