Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓనర్ కొడుకు అర్థరాత్రి వచ్చి తలుపు కొట్టి కోర్కె తీర్చమంటున్నాడు... ప్లీజ్ రక్షించండి.. (Video)

పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లిన ఓ మహిళ అష్టకష్టాలు పడుతోంది. ఆమె పని చేసే ఇంటి యజమాని కుమారుడి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటోంది.

Webdunia
గురువారం, 27 జులై 2017 (09:23 IST)
పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లిన ఓ మహిళ అష్టకష్టాలు పడుతోంది. ఆమె పని చేసే ఇంటి యజమాని కుమారుడి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటోంది. ఇంటి పనిలో చేరినప్పటి నుంచి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడనీ, అందువల్ల తనను రక్షించాలంటూ ఆమె ప్రాధేయపడుతూ ఓ వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ఇపుడు వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
భారత్‌కు చెందిన ఓ మహిళ గత యేడాది డిసెంబరులో ఓ కన్సెల్టెన్సీ ద్వారా షార్జాకు వెళ్లింది. అక్కడ ఓ ఇంట్లో పనిమనిషిగా కుదిరింది. పనిలో చేరిన తర్వాత ఇంటి యజమానితో పాటు కన్సల్టెన్సీ నుంచి సమస్యలు మొదలయ్యాయి. తన బాధలు భరించలేక ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వారం రోజులు పనిచేసి నచ్చితే ఉండు.. లేకుంటే భారత్‌కు రావొచ్చిని తనకు చెప్పారని ఆమె వాపోయింది. కానీ ఇపుడు పరిస్థితి భిన్నంగా ఉందని బోరున విలపిస్తోంది. 
 
'దుబాయిలోని కన్సల్టెన్సీ నిర్వాహకులు పిలిచి డబ్బు అడిగారు. లేదని చెబితే చిత్ర హింసలు పెట్టారు. యజమాని, ఆమె భార్య కొట్టేవారు, తిట్టేవాళ్లు. నాతోపాటు ఉన్న ఫిలిప్పీన్స్ యువతుల్ని కూడా కొడుతున్నారు. వెళ్లిపోతా అని చెబితే.. 2 లక్షల రూపాయలు ఇచ్చి వెళ్లమంటున్నారు. నరకం అనుభవిస్తున్నా.. నన్ను కాపాడండి. యజమాని పెద్ద కొడుకు చాలా దారుణంగా ప్రవర్తించేవాడు. అర్థరాత్రి ఒకటి, రెండు గంటల సమయంలో వచ్చేవాడు. నేను పడుకునే రూమ్ తలుపు కొట్టేవాడు. తీయకుంటే మరుసటి రోజు ఉదయం గొడవ చేసి కొట్టేవాడు. భరించలేకపోతున్నా' అని ఆ మహిళ తన ఆవేదన వ్యక్తంచేసింది. తాను షార్జాలో ఉండే ఇంటి అడ్రస్‌ను చెప్పింది. ఎలాగయినా తనను రక్షించాలని, భారత్‌కు పంపించాలని ఆమె ప్రాధేయపడుతోంది. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం