Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదాగా జాగింగ్ చేస్తూ సరిహద్దులు దాటిన యువతి

సరదాగా జాగింగ్ చేస్తూ ఓ యువతి సరిహద్దులు దాటేసింది. దీంతో భద్రతా దళాలకు పట్టుబడి లేనిపోని కష్టాలు తెచ్చుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 19 సంవత్సరాల సిడెల్లా రోమన్ అనే యువతి, మ

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (11:24 IST)
సరదాగా జాగింగ్ చేస్తూ ఓ యువతి సరిహద్దులు దాటేసింది. దీంతో భద్రతా దళాలకు పట్టుబడి లేనిపోని కష్టాలు తెచ్చుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 19 సంవత్సరాల సిడెల్లా రోమన్ అనే యువతి, మే 21న నదీ తీరంలో జాగింగ్ కోసం వెళ్లింది. ఫ్రాన్స్ జాతీయురాలు అయిన ఆమె, తన తల్లిదండ్రులకు కలుసుకునేందుకు కెనడా వచ్చింది. జాగింగ్ చేసుకుంటూ, పచ్చటి అందాలను చూస్తూ మైమరచి పోయి చూస్తూ, సరిహద్దులు దాటి మూడు మైళ్ల దూరం వెళ్లింది.
 
సరిహద్దుల్లో ఓ యువతి తచ్చాడుతుండటాన్ని గమనించిన అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులు.. ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. తాను పొరపాటున సరిహద్దులు దాటానని చెప్పినా వారు వినిపించుకోలేదు. 
 
సరిహద్దులు సూచించేలా బోర్డులు కనిపించలేదని చెప్పినా ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రోమన్ దగ్గర ఎటువంటి గుర్తింపు కార్డులూ లేకపోవడంతో ఆ ప్రాంతానికి 140 మైళ్ల దూరంలోని టకోమా నార్త్ వెస్ట్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. ఆక్కడ రెండు వారాల పాటు నిర్బంధించి, రోమన్ వివరాలన్నీ తెలుసుకుని విడిచిపెట్టారు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments