Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి మృతి.. కరోనానే కారణమా?

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (10:54 IST)
Tanzania
టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి మృతిచెందారు. ఆయన వయసు 61 ఏళ్లు. అధ్యక్షుడు జాన్ మరణించినట్లు ఉపాధ్యక్షుడు హసన్ ఓ ప్రకటనలో తెలిపారు. దరసలామ్‌లో ఉన్న హాస్పిటల్‌లో.. గుండె సంబంధిత వ్యాధి వల్ల అధ్యక్షుడు జాన్ మృతిచెందినట్లు తెలిపారు. గత రెండు వారాల నుంచి మగుఫులి ప్రజాజీవితంలో లేరు. అయితే ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఆయన బయటకు రావడం లేదని తెలుస్తోంది. 
 
కరోనా వైరస్ వల్ల ఆయన మృతిచెందిన ఉంటారని భావిస్తున్నారు. అధ్యక్షుడు జాన్‌కు కరోనా సంక్రమించినట్లు గత వారం ప్రతిపక్షాలు ఆరోపించాయి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ విషయాన్ని ద్రువీకరించలేదు. దేశంలో 14 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నారు. టాంజానియా రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షుడు హసన్‌.. దేశాధ్యక్ష బాధ్యతలు చేపడుతారు. 
 
గత ఏడాది మగుఫులి దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 27వ తేదీన చివరిసారి మగుఫులి పబ్లిక్‌గా కనిపించారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు. ఆయన ఆరోగ్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధ్యక్షుడు జాన్‌కు కరోనా సంక్రమించిందని, ఆయన కెన్యాలో చికిత్స పొందుతున్నట్లు ఇటీవల ప్రతిపక్ష నేత టుండు లిస్సు ఆరోపించారు. కరోనా వైరస్ అంటూ ఏదీ లేదని గత ఏడాది అధ్యక్షుడు జాన్ మగుఫులి ప్రకటించారు. గత ఏడాది జూన్‌లోనే ఆయన దేశాన్ని కోవిడ్ ఫ్రీగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments