Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ జైలులో భారతీయ ఇంజనీర్‌పై దాడి.. సాయం చేయాల్సిందిగా సుష్మా స్వరాజ్ ఆదేశం

పాకిస్థాన్ జైలులో ఉన్న ఓ భారతీయ ఇంజనీర్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంజనీర్ ముంబై వాసి. అతని పేరు హమీద్ అన్సారీ. అతనిపై ఇప్పటివరకు జైలు ఖైదీలు మూడు సార్లు దాడి చేశారు.

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2016 (16:13 IST)
పాకిస్థాన్ జైలులో ఉన్న ఓ భారతీయ ఇంజనీర్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంజనీర్ ముంబై వాసి. అతని పేరు హమీద్ అన్సారీ. అతనిపై ఇప్పటివరకు జైలు ఖైదీలు మూడు సార్లు దాడి చేశారు. దీంతో అతను జైలులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ స్పందించారు. అన్సారీకి వెంటనే న్యాయ సాయం అందించాలని పాకిస్థాన్‌లోని భారత హైకమిషనర్‌కు ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా సుష్మస్వరాజ్ తెలిపారు. 
 
హమీద్‌ అన్సారీ ఆన్‌లైన్‌లో పరిచయమైన యువతిని కలిసేందుకు 2012లో పాకిస్థాన్‌ వెళ్లాడు. నకిలీ ధ్రువ పత్రాలతో దేశంలోకి ప్రవేశించినందుకు అతనిని పాకిస్థాన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెషావర్‌ కోర్టు అతనికి మూడేళ్లు జైలు శిక్ష విధించింది. ఇటీవల కాలంలో తన క్లయింట్‌పై జైలులోని తోటి ఖైదీలు మూడుసార్లు దాడులు జరిపారని, అతని ప్రాణాలకు ముప్పు ఉందని అన్సారీ తరపు న్యాయవాది క్వాజీ మెహమ్మద్ అన్వర్ పెషావర్ కోర్టుకు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments