Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిహాదీ స్థావరాలపై భారత దాడి నిజమే.. కళ్లారా చూశాం..: షాకిచ్చిన కాశ్మీర్ ప్రజలు

భారత ఆర్మీ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టిందా లేదా? అనే అనుమానాన్ని ఐరాస వ్యక్తం చేయడంతో పాటు.. భారత సైన్యం అసలు సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదని పాకిస్థాన్ మీడియా దుష్ప్రచారం చ

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (12:44 IST)
భారత ఆర్మీ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టిందా లేదా? అనే అనుమానాన్ని ఐరాస వ్యక్తం చేయడంతో పాటు.. భారత సైన్యం అసలు సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదని పాకిస్థాన్ మీడియా దుష్ప్రచారం చేస్తోంది. స్వదేశంలోని కొందరు రాజకీయ నేతలు కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని భారత ఆర్మీపై రాజకీయ బురద చల్లుతున్నారు. వీరందరికీ కాశ్మీర్‌ ప్రజలు సరైన షాక్ ఇచ్చారు. భారత సైన్యం జరిపిన దాడులను తాము కళ్లారా చూశామని చెప్పారు. 
 
సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి.. భారత ఆర్మీ బలగాలు చేసిన దాడిని ప్రత్యక్షంగా చూసిన కొంతమంది.. వాటికి సంబంధించిన గ్రాఫిక్స్‌ను విడుదల చేశారు. తాము కళ్లారా ఆ దాడులను చూశామని నొక్కి చెప్పారు. ఈ దాడులు చాలా కొద్దిసేపే జరిగినా.. అవి చాలా శక్తిమంతమైనవని కాశ్మీర్ ప్రజలు అంటున్నారు.
 
ఈ ఆపరేషన్ ముగించుకుని వెళ్లేముందు జిహాదీల స్థావారాలన్నింటినీ భారత ఆర్మీ ధ్వంసం చేసిందని చెప్పారు. అలాగే సర్జికల్ స్ట్రైక్స్‌లో మృతి చెందిన టెర్రరిస్టుల మృతదేహాలను పాకిస్థాన్ రహస్యంగా ఖననం చేసేందుకు సెప్టెంబర్ 29 తెల్లవారుజామున ట్రక్కుల్లో తీసుకెళ్ళినట్టు ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికే వెల్లడించారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments