Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాన్ని సూపర్ మార్కెట్లో పెట్టుకుని వ్యాపారం చేస్తారా? మానవత్వం ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (20:52 IST)
umbrellas
మానవత్వం మంటగలిసిపోయింది. కరోనా వంటి రోగాలు వచ్చినా.. మనిషిలో మానవత్వం లేకుండా పోయింది. తాజాగా ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేసే వ్యక్తి చనిపోతే.. సదరు సూపర్ మార్కెట్ యాజమాన్యం మాత్రం అస్సలు పట్టించుకోలేదు.

అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం అందివ్వకుండా శవం మీద గొడుగులు కప్పి పేలాలు ఏరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో ఆ సూపర్ మార్కెట్ నిర్వాకం బయటి ప్రపంచానికి తెలిసింది. దీంతో యాజమాన్యం తాము చేసిన పనికి క్షమాపణలు చెప్పింది. ఈ వ్యవహారంలో బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లోని కర్రెఫోర్ సూపర్ మార్కెట్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న మోయిసెస్ సంతోస్ కవాల్కంటే అనే ఉద్యోగి గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. అయితే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా స్టోర్‌లోనే అత్యవసర చికిత్స అందించారు. ఆ చికిత్స సరిపోకపోయేసరికి అతను మృతిచెందాడు. అతను మరణించినా.. యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోలేదు. 
 
అతని కుటుంబానికి సమాచారం అందివ్వలేదు. అతని చావుతో తమ వ్యాపారం ఎక్కడ ఆగిపోతుందోనని శవాన్ని ఒక మూలన పెట్టి చుట్టూ గొడుగులు, డబ్బాలు కప్పారు. ఈ విషయం తెలిసిన కొంతమంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి కాస్తా వైరల్ కావడంతో ఆ సూపర్ మార్కెట్ యాజమాన్యంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని నెటిజన్లు చీవాట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments