Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రుడు.. సూర్యుని రంగులో కనిపిస్తాడట-31న సూపర్ మూన్ తప్పక చూడండి..!

నిత్యం రాత్రి వేళల్లో ఈ లోకానికి వెలుగునిచ్చే చందమామ.. ఈ నెల 31వ తేదీన ఎరుపుగా మారిపోనున్నాడు. ఒకే నెలలో రెండు పౌర్ణమి సందర్భాలు వస్తే రెండో పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడిని బ్లూమూన్ అంటారు. ఈ నెల 31న

Webdunia
ఆదివారం, 28 జనవరి 2018 (17:14 IST)
నిత్యం రాత్రి వేళల్లో ఈ లోకానికి వెలుగునిచ్చే చందమామ.. ఈ నెల 31వ తేదీన ఎరుపుగా మారిపోనున్నాడు. ఒకే నెలలో రెండు పౌర్ణమి సందర్భాలు వస్తే రెండో పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడిని బ్లూమూన్ అంటారు. ఈ నెల 31న సూపర్ మూన్‌తో పాటు బ్లూమూన్ రూపంలోనూ చంద్రుడు కనిపిస్తాడు. ఇలా పదేళ్లకోసారి జరుగుతుంది. ఈ నెల 31న సాయంత్రం 6.21 గంటల నుంచి 7.37 గంటల మధ్య చందమామను కొత్తగా చూడొచ్చునని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  
 
ఆ రోజున మామూలు కంటే ఎక్కువ సైజులో సూపర్‌ మూన్‌గా కనిపిస్తాడు. ఈ నెల 31న పౌర్ణమి, చంద్రగ్రహణం కావడంతో సాధారణ పరిమాణం కంటే 14 శాతం అధిక పరిమాణంలో చంద్రుడు కనిపించనున్నాడు. ఇంకా 31న ఎర్రటి రంగులో చంద్రుడు కనిపిస్తాడట. ఇందుకు కారణం ఏమిటంటే.. గ్రహణ సమయంలో చంద్రుడు భూమి నీడలోకి వెళతాడు. దాంతో సూర్యుడి నుంచి వచ్చే కాంతి ముందుగా భూమిపై పడుతుంది. అక్కడి నుంచి అది చంద్రుడుడిపైకి ప్రకాశించడంతో చందమామ ఎర్రటి వర్ణంలో కనిపిస్తాడు.
 
ఒకే నెలలో అంటే.. ఈ నెల (జనవరి 1, 2) తేదీల్లో పౌర్ణమి రాగా, ఈ నెల చివర్లో 31న రెండో పౌర్ణమి రావడం ద్వారా బ్లూమూన్ రూపంలో చంద్రుడు కనిపిస్తాడని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ మూన్ ప్రజలకు కనువిందు చేస్తాడని.. చంద్రుడిని బ్లూమూన్ సందర్భంగా ఫోటోలు తీసేందుకు నాసా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments