Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ నిబంధనలు గాలికి.. వజ్రాల కోసం వేట... ఎక్కడ?

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (16:10 IST)
కరోనా కష్టకాల్లో తమను ఆర్థికంగా ఆదుకునేందుకు ఏ చిన్న అవకాశం అందుబాటులోకి వచ్చినా దాన్ని ఏ ఒక్కరూ వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. అలాంటి వారిలో సౌతాఫ్రికా వాసులు కూడా ఉన్నారు. ఈ దేశంలోని ఓ వర్గ ప్రజలు వజ్రాల కోసం తవ్వకాలు సాగిస్తున్నారు. 
 
కరోనా కల్లోలంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన సౌతాఫ్రికాను మరో సమస్య వేధిస్తుంది. సౌతాఫ్రికాలోని ఓ చిన్న కుగ్రామంలో వేల మంది కోవిడ్ నిబంధనలు అతిక్రమించి గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. ఆ గ్రామంలో విలువైన వజ్రాలు దొరుకుంతడడమే అందుకు కారణం. 
 
అయితే, ఈ తవ్వకాల్ని కట్టడి చేయడంలో స్థానిక యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. ఇంతమంది ఒకేసారి గుమిగూడడంతో కోవిడ్ విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. 
 
మరోవైపు కోవిడ్ ఎఫెక్ట్‌తో దక్షణాఫ్రికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. లక్షల మంది ప్రజలు పేదరికంలో కూరుకుపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ తలరాతను మార్చుకునేందుకు వజ్రాల వేటను ముమ్మరం చేస్తున్నారు. అయితే, వారం రోజుల నుంచి తవ్వకాల్లో దొరుకుతున్నవి వజ్రాలేనా అనేది తేల్చడంలో జియాలజిస్టులు నిమగ్నమైవున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments