Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదిపురుష్ కు ఆ ఇద్ద‌రూ ఖారారు అయిన‌ట్లే!

Advertiesment
ఆదిపురుష్ కు ఆ ఇద్ద‌రూ ఖారారు అయిన‌ట్లే!
, బుధవారం, 9 జూన్ 2021 (11:37 IST)
Aadipurush
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న సినిమా `ఆదిపురుష్‌`. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓంరౌత్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా 3డి టెక్నాల‌జీలో రూపొందుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా క‌రోనాకుముందే షూటింగ్ ప్రారంభించి స‌గం పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. మ‌ర‌లా ఆ చిత్రం కొన‌సాగించ‌డానికి రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేయ‌నున్న‌ట్లు తెలిసిందే. ఇదిలా వుండ‌గా,  ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్ విడుద‌లవుతూ వుంది. తాజాగా ఈ సినిమాకు సంగీతాన్ని ఎవ‌రు అందిస్తున్నారో తెలిసిపోయింది.
 
బాలీవుడ్ సంగీత ద్వ‌యం సాచెత్ తాండ‌న్, ప‌రంప‌ర ఠాగూర్ బాణీలు స‌మ‌కూరుస్తున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లో అధికారికంగా చిత్ర మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే పరంప‌ర `సాహో` ప్ర‌భాస్ సినిమాకు `స‌యాన్ సైకో` పాట‌ల‌కు సంగీతం అందించారు. ఇక వీరిద్ద‌రూ క‌లిసి బాలీవుడ్ ప‌లు సినిమాల‌కు సంగీతాన్ని స‌మ‌కూర్చారు. క‌బీర్‌సింగ్‌, భ‌మి, త‌న్‌హాజీ వంటి ప‌లు చిత్రాల‌కు వారు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా కృతి స‌న‌న్ సీత‌గా, రావ‌ణుడిగా సైఫ్ అలీకాన్ న‌టిస్తున్నారు. టీ సీరిస్ సంస్థ‌పై భూష‌ణ్‌కుమార్‌, కృష్ణ‌కుమార్‌, రాజేష్ నాయ‌ర్‌, ఓంరౌత్ ఈ భారీ సినిమాను నిర్మిస్తున్నారు. ఇండియాతోపాటు విదేశాల్లోనూ ప‌లు భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనూసూద్‌కు మెగాస్టార్ చెక్ పెడుతున్నారా!