Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతరిక్షంలో డిన్నర్.. ఆరగించాలంటే ధర రూ.4.41 కోట్లు

ఠాగూర్
ఆదివారం, 17 మార్చి 2024 (11:47 IST)
స్పేస్ వీఐపీ సంస్థ ఔత్సాహిక పర్యాటకుల కోసం అంతరిక్ష యాత్రను ప్రకటించింది. బెలూన్ ద్వార పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. అక్కడే డిన్నర్ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ధరను రూ.4.41 కోట్లుగా నిర్ణయించింది. డిన్నర్ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమ్ చేసే సౌలభ్యం కూడా ప్రకటించింది. ఈ యాత్రను వచ్చే యేడాది చేపట్టనున్నట్టు ప్రటించింది. నాసా అందించిన బెలూన్‌తో ఈ ట్రిప్‌ను నిర్వహించనుంది.
 
వచ్చేడాది ఏడాది నుంచి ప్రారంభంకానున్న ఈ పర్యటన కోసం కంపెనీ ఇప్పటికే ప్రముఖ డానిష్ షెఫ్ బెలూన్ (పాకశాస్త్రనిపుణుడు) రంగంలోకి దింపింది. ప్రపంచంలో ఐదో అత్యద్భుత రెస్టారెంట్‌గా పేరుగాంచిన ప్రముఖ డానిష్ రెస్టారెంట్లో ఆయన షెఫ్ ఉన్నారు. హైటెక్ స్పేస్ బెలూల్లో అతిథులకు షెఫ్ స్వయంగా ఆహారాన్ని వండనున్నారు. ఈ ట్రిప్ భాగంగా పర్యాటకులు లక్ష అడుగుల ఎత్తున అంతరిక్షంలో సూర్యోదయ సూర్యాస్తమయాల్ని ఆస్వాదిస్తూ డిన్నర్‌ను ఎంజాయ్ చేయచ్చు. ఈ డిన్నర్‌లో వడ్డించే ఆహారాన్ని రాస్మస్ మంక్ ఎంపిక చేయనుంది. 
 
అంతేకాదు, డిన్నర్ మొత్తాన్ని భూమ్మీదున్న శ్రేయోభిలాషులు, మిత్రులకు లైవ్ చేసే అవకాశం కూడా అతిథులకు కల్పించారు. ఇందుకోసం బెలూన్‌లో అత్యాధునిక వైఫై ఏర్పాటు చేశారు. ఈ జర్నీ మెనూ ఇంకా సిద్ధం కాలేదు. అయితే, ట్రిప్‌గానే మెనూ కూడా సృజనాత్మకంగా ఉండబోతోందని ప్రధాన చెఫ్ వెల్లడించారు. ఈ పర్యటనకు మొత్తం ఆరుగురిని అంతరిక్షంలోకి తీసుకెళతారు. ఒక్కో టిక్కెట్ ధర సుమారు 5 లక్షల డాలర్లుగా (సుమారు రూ.4.14 కోట్లు) ఉండొచ్చని సమాచారం. ధర ఇంత భారీగా ఉన్నా ఔత్సాహిక పర్యాటకులు మాత్రం వెనక్కుతగ్గలేదు. ట్రిప్ గురించి ప్రకటించిన 24 గంటల లోపే అనేక మంది తమ పేర్లు రిజిస్టర్ చేసుకుంటామంటూ ముందుకొచ్చారు.
 
ఈ ట్రిప్‌లో భాగంగా అతిథులను ప్రత్యేక క్యాప్సూల్లో కూర్చోబెడతారు. నాసా సిద్ధం చేసిన అంతరిక్ష బెలూన్ల సాయంతో ఈ క్యాప్సూల్‌ను అంతరిక్షంలోకి తీసుకెళతారు. ఈ ట్రిప్ పాల్గొనేందుకు ముందస్తు ట్రెయినింగ్ ఏదీ అవసరం లేదని స్పేస్ వీఐపీ పేర్కొంది. వచ్చే నెల నుంచి ఈ క్యాప్సూల్, బెలూన్లపై పరీక్షలు మొదలవుతాయని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీమ్ మెంబరుతో రెహ్మాన్‌ రిలేషన్‌లో ఉన్నారా?

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments