Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో మొత్తం లోక్‌సభ స్థానాలు 543.. కానీ ఎన్నికలు నిర్వహించేది 544.. ఎలా?

rajiv kumar

PNR

, ఆదివారం, 17 మార్చి 2024 (09:40 IST)
దేశంలో ఉన్న మొత్తం లోక్‌సభ స్థానాలు 543. ఈ స్థానాల్లో ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో ఎన్నికలను 544 స్థానాల్లో నిర్వహించనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా, 544 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన వివరణ ఇచ్చారు.
 
ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. అయితే, దేశంలో 543 లోక్‌సభ  స్థానాలు ఉంటే, ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌లో మాత్రం 544 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. దీనిపై పలువురు సందేహాలు వ్యక్తం చేయడంతో ఈసీ వివరణ ఇచ్చింది. 
 
దేశంలో కొత్త స్థానాలు ఏపీ ఏర్పాటు కాలేదన్నారు. అయితే, మణిపూర్‌లో ఇన్న మణిపూర్ స్థానానికి మాత్రం రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తామన్నారు. తొలి విడత ఏప్రిల్ 19వ తేదీన, రెండో విడత 26వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఫలితంగా జాబితాలో ఒక లోక్‌సభ స్థానం అదనంగా కనిపించిందని ఆయన వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారా లోకేష్- పవన్- బాలయ్యలపై ఆ ముగ్గురు మహిళల పోటీ!