Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో పాము-కొట్టి చంపిన యువకుడు (video)

రైలులోకి పాము ప్రవేశించింది. అంతే ప్రయాణీకులందరూ జడుసుకుంటున్నారు. ఆ పాము గురించి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చేలోపే.. ఓ యువకుడు దాని తోకపట్టుకుని లాగి.. ఒక్కసారిగా కింద కొట్టి చంపేశాడు. ఈ ఘటనకు సంబ

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (14:14 IST)
రైలులోకి పాము ప్రవేశించింది. అంతే ప్రయాణీకులందరూ జడుసుకుంటున్నారు. ఆ పాము గురించి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చేలోపే.. ఓ యువకుడు దాని తోకపట్టుకుని లాగి.. ఒక్కసారిగా కింద కొట్టి  చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలో బోగోర్ నుంచి జ‌కార్తా వెళ్తున్న ఓ లోక‌ల్ ట్రైన్‌లో పాము వచ్చింది. 
 
రైల్లోకి ఈ పాము ఎవ‌రో ఒక ప్ర‌యాణికుడి బ్యాగు నుంచే వ‌చ్చి ఉంటుంద‌ని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు. బ్యాగులు పెట్టుకునే చోట నక్కిన పామును వెనక బ్యాగు తగిలించుకున్న యువకుడు కొట్టి చంపేశాడు. ఇండోనేషియాలో ప్ర‌జార‌వాణాలో జంతువుల‌ను తీసుకెళ్ల‌డంపై నిషేధం ఉన్నప్పటికీ ఆ పామును రైలులోకి ఎవరు తెచ్చారు.. ఎలా వచ్చిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 
 
జకార్తాలోని బోగర్ ప్రాంతం నుంచి రాజధానికి ప్రయాణించే రైలులో ఈ ఘటన జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది పామును చూస జడుసుకుని పక్కన నిలబడితే ఓ యువకుడు దాన్ని సులువుగా తోకపట్టుకుని నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోకు 174.4కె వ్యూస్ వచ్చాయి. అలాగే 3,587 కామెంట్స్ నమోదైనాయి. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments