Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త అతడి తల్లికంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు... విడాకులు కోరిన మహిళ

ప్రతి భార్యా తన భర్త అందరికంటే ఎక్కువగా తననే ప్రేమించాలని కోరుకుంటుంది. అయితే ఈ మహిళ మాత్రం తన భర్త అలా చేసినందుకు విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది. దానికి ఆమె చెప్పిన కారణం ఏంటయా అంటే, తన భర్త అతని తల్లి కంటే ఎక్కువగా తనను ప్రేమిస్తున్నాడనీ, అందువల్ల

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (17:53 IST)
ప్రతి భార్యా తన భర్త అందరికంటే ఎక్కువగా తననే ప్రేమించాలని కోరుకుంటుంది. అయితే ఈ మహిళ మాత్రం తన భర్త అలా చేసినందుకు విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది. దానికి ఆమె చెప్పిన కారణం ఏంటయా అంటే, తన భర్త అతని తల్లి కంటే ఎక్కువగా తనను ప్రేమిస్తున్నాడనీ, అందువల్ల వెంటనే తనకు విడాకులు ఇప్పించాలన్నది. ఇలా కోరుతో ఆమె వేసిన పిటిషన్‌ చూసి సౌదీ కోర్టు అవాక్కైంది. ఈ పనికి షాకయిన 29 ఏళ్ల ఆమె భర్త తనతో కలిసి వుండాలని కాళ్లావేళ్లా పడ్డాడు.
 
కోర్టులో అంతా చూస్తుండగానే కాళ్లు పట్టుకున్నంత పనిచేశాడు. అయినప్పటికీ ఆ యువతి తన నిర్ణయం మార్చుకోలేదు. తల్లి కంటే ఎక్కువగా భార్యను ప్రేమించే మగాడిని తను నమ్మనని తేల్చి చెప్పింది. తనకు ఏం కావాలన్నా క్షణాల్లో తెచ్చిపెట్టడమే కాదు, తన సంతోషం కోసం ఎంతో డబ్బు ఖర్చుపెడుతున్నాడని కోర్టుకు విన్నవించింది. అదే సమయంలో తన భర్త ఆయన తల్లిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
 
తన తల్లినే ప్రేమించని వాడు.. తనను మాత్రం ఎంతకాలం ప్రేమిస్తాడు? రేపు ఇంకో అమ్మాయి వస్తే తనను వదిలేయడని గ్యారంటీ ఏమిటి? అందుకే తనకు విడాకులు ఇప్పించండంటూ ఆ యువతి కోర్టుకు విజ్ఞప్తి చేసింది. పెళ్లి సమయంలో అతను ఇచ్చిన కట్నం తిరిగి ఇచ్చేసింది. ఆమె మాటల విని న్యాయమూర్తి అభినందిస్తూ విడాకులు మంజూరు చేయడమే కాకుండా నవమాసాలు మోసి, కని, పెంచి, పెద్ద చేసిన తల్లికే కుటుంబంలో అగ్రస్థానం ఇవ్వాలనీ, అమ్మ ప్రేమకు ఎవ్వరూ సాటిరారని వ్యాఖ్యానించారు జడ్జి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments