Webdunia - Bharat's app for daily news and videos

Install App

20, 000 తేనెటీగలతో నిండు గర్భిణీ ఒళ్లు గగుర్పొడిచే సాహసం, బిడ్డ బలి...

ఈమధ్య కాలంలో ప్రతి విశేషానికి ఫోటోషూట్‌లు కామనైపోయాయి. మెటర్నిటీ ఫోటోషూట్‌లకు ఈమధ్య బాగా క్రేజ్ పెరిగిపోయింది. వివిధ లొకేషన్లలో అందమైన భంగిమలలో ఫోటోలు తీసుకుని దంపతులు ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే అందరిలా తీసుకుంటే గొప్పేముంది అనుకుం

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (19:15 IST)
ఈమధ్య కాలంలో ప్రతి విశేషానికి ఫోటోషూట్‌లు కామనైపోయాయి. మెటర్నిటీ ఫోటోషూట్‌లకు ఈమధ్య బాగా క్రేజ్ పెరిగిపోయింది. వివిధ లొకేషన్లలో అందమైన భంగిమలలో ఫోటోలు తీసుకుని దంపతులు ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే అందరిలా తీసుకుంటే గొప్పేముంది అనుకుందో ఏమిటో ఒక యువతి ఏకంగా 20,000 తేనేటీగలను తన ఒంటిపై వాలేలా చేసి ఫోటోషూట్‌లో పాల్గొని ఆ ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లలో పోస్ట్ చేసింది. ఇప్పుడు అవి ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. 
 
వివరాలలోకెళ్తే, యూఎస్‌‌కి చెందిన ఎమిలీ మ్యుయెల్ల‌ర్, త‌న భ‌ర్త ఇద్ద‌రూ క‌లిసి 2015వ సంవ‌త్స‌రంలో మ్యుయెల్ల‌ర్ బీ కంపెనీని స్థాపించారు. ఇప్పుడు ఆ మ‌హిళ నిండు గ‌ర్భ‌వ‌తి. తన ఫోటోషూట్ విలక్షణంగా ఉండాలని భావించిన ఆమె త‌మ తేనెటీగ‌ల ఫారమ్‌కి వెళ్లి, అక్కడ ఉన్న 20,000 తేనెటీగలను తన ఒంటిపై వాలించుకుంది. ఆపై వాటితో ఫొటోషూట్ చేసింది. సాధారణంగా ఒక తేనెటీగ కుడితేనే ఎంతో బాధ, నొప్పి కలుగుతుంది. అలాంటిది ఒక నిండు గర్భిణి అంత‌టి సాహ‌సం చేసినందుకు ఆమెకు నెటిజన్ల నుండి ప్రశంసలు అందాయి. 
 
కానీ దురదృష్టవశాత్తూ 6 రోజులలో పండంటి బిడ్డ పుట్టాల్సి ఉండగా కడుపులో చనిపోవడం అందరినీ కలచివేసింది. తేనెటీగల వలన పిండానికి ప్రమాదం జరిగే దాఖలాలు నిరూపితం కాకపోయినప్పటికీ దీనికి కారణం తెలియాల్సి ఉంది. ఈ సాహసం ఖరీదు ఒక బిడ్డ ప్రాణం.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments