Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీతో కలిసివుండలేం.. మాకూ స్వాతంత్ర్యం కావాలి... బ్రిటన్‌తో స్కాట్లాండ్ కటీఫ్!

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వేరుపడాలా? వద్దా? అనే అంశంపై నిర్వహించిన 'బ్రెగ్జిట్' పోల్ ఫలితాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. ఈ ఫలితాలు వెల్లడైన తొలిరోజున ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అల

Webdunia
ఆదివారం, 26 జూన్ 2016 (15:52 IST)
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వేరుపడాలా? వద్దా? అనే అంశంపై నిర్వహించిన 'బ్రెగ్జిట్' పోల్ ఫలితాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. ఈ ఫలితాలు వెల్లడైన తొలిరోజున ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అలాగే, బ్రిటన్ పౌండ్ విలువ దారుణంగా పడిపోయింది. స్థిరాస్తుల విలువ కరిగిపోయింది. ఇది బ్రిటన్ వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇది సద్దుమణగక ముందే.. బ్రిటన్‌లో ఓ భాగంగా ఉన్న స్కాట్లాండ్ ఇపుడు స్వేచ్ఛావాయువులను కోరుకుంటోంది. బ్రిటన్‌తో కలిసివుండలేమంటూ ఆ దేశ పౌరులు నినదిస్తున్నారు. 
 
అలాగే, నెదర్లాండ్స్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, ఫ్రాన్స్‌లలోనూ అదే తరహా డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. ఈయూ వ్యతిరేక, రైట్‌వింగ్‌, వలసలను వ్యతిరేకించే పార్టీలన్నీ దీనిపై రెఫరండం నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 'బ్రెగ్జిట్' ఫలితంతో కొన్ని దేశాల్లోని అధికార, విపక్ష పార్టీలు పండగ చేసుకుంటున్నాయి. ఈయూలో కొనసాగడంపై ఆయా దేశాల్లో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు గ్రేట్‌ బ్రిటన్‌ (యూకే)లో తామెందుకు ఉండాలంటూ స్కాట్లాండ్‌ ప్రశ్నిస్తోంది. యూకేలో కొనసాగడంపై స్కాట్లాండ్‌లో కొత్త రెఫరండం నిర్వహించనుంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో... స్థానికులు ‘వేరు కుంపటి’కే ఓటు వేసేలా స్కాట్కాండ్ ప్రజలు సిద్ధమవుతున్నారు. 
 
మరోవైపు.. బ్రెగ్జిట్’ ప్రకంపనలు అగ్రరాజ్యం అమెరికానూ తాకాయి. అమెరికా నుంచి మాకు స్వాతంత్య్రం కావాలి అంటూ టెక్సాస్‌లో ఇప్పటికే ఉన్న డిమాండ్‌ ఉద్యమ రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. డేనియల్‌ మిల్లర్‌ అధ్యక్షతన టెక్సాస్‌ నేషనలిస్ట్‌ మూమెంట్‌(టీఎన్‌ఎం) నడుస్తోంది. టెక్సాస్‌కు స్వాతంత్య్రం అనే అంశంపై ప్రారంభమైన ఉద్యమం.. బ్రెగ్జిట్ ఫలితం తర్వాత ఊపందుకుంది. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments