Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై ఖురాన్ పేజీలు.. ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేసిన అల్లరి మూకలు.. 250 మందిపై కేసు

పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఓ ఎమ్మెల్యే ఇంటిని కొందరు అల్లరి మూకలు ధ్వంసం చేశారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌కు సంబంధించిన కొన్ని పేజీలు రోడ్డుపై పడివుండటంతో ఈ అల్లర్లు చెలరేగాయి.

Webdunia
ఆదివారం, 26 జూన్ 2016 (14:49 IST)
పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఓ ఎమ్మెల్యే ఇంటిని కొందరు అల్లరి మూకలు ధ్వంసం చేశారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌కు సంబంధించిన కొన్ని పేజీలు రోడ్డుపై పడివుండటంతో ఈ అల్లర్లు చెలరేగాయి. 
 
లుథియానాలోని మెలెర్‌కోట్లాలోని జార్గ్‌చౌక్ ప్రాంతంలో ఖురాన్‌కు చెందిన కొన్ని పేజీలు చిరిగిపడివుండటాన్ని కొందరు గమనించారు. ఈ విషయమై ప్రశ్నించేందుకు ఎమ్మెల్యే ఫర్జానా నిస్సారా ఖతూన్ ఇంటికి కొందరు వెళ్లారు. వారిని ఇంట్లోకి అనుమతించేందుకు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో రెచ్చిపోయిన గుంపులోని కొందరు వారిపై దాడిచేసి ఇంట్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. ఎమ్మెల్యే వాహనాలను ధ్వంసం చేశారు.
 
అంతటితో ఆగకుండా, ఎమ్మెల్యే ఇంటి పక్కనే పార్కింగ్ చేసివున్న ప్రైవేట్ బస్సుకు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనకు సంబంధించి 250 మందిపై వివిధ కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. 
 
దీనిపై స్థానిక డీఎస్పీ రణ్‌ధీర్ సింగ్ స్పందిస్తూ.. సుమారు 300 మంది వరకు ఒక్కసారి ఎమ్మెల్యే ఇంటి వద్దకు రావడంతో ఆత్మ రక్షణార్థం ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపారని, దీంతో రెచ్చిపోయిన అల్లరి మూక ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసినట్టు చెప్పారు. 

ధనుష్, సందీప్ కిషన్ సన్ ల రాయన్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఫిక్స్

కర్నాటక, హైదరాబాదు లో ప్రతి లొకేషన్ కి నెమలి వచ్చేది: హరోం హర డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక

తుఫాను హెచ్చరిక టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

యేవ‌మ్ టీమ్‌ను చూస్తుంటే ముచ్చ‌ట‌గా వుంది: మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్

పుష్ప‌-2 ప్రోడక్ట్ పనుల్లో సుకుమార్ తో టెక్నీషియన్ విభేదాలు?

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments