Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా.. యువతిని గొడ్డును బాదినట్లు బాదారు.. వాళ్లెవరు?

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా సాటి మహిళనే కనికరం లేకుండా.. కొందరు మహిళలు మరో యువతిని గొడ్డును బాదినట్టు బాదారు. బట్టలు చించి పైశాచికంగా ప్రవర్తించారు. దీనిని అడ్డుకోవాల్సిన ప్రజలు ఆ దృశ్యాలను తమ ఫోన్ల

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (09:17 IST)
నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా సాటి మహిళనే కనికరం లేకుండా.. కొందరు మహిళలు మరో యువతిని గొడ్డును బాదినట్టు బాదారు. బట్టలు చించి పైశాచికంగా ప్రవర్తించారు. దీనిని అడ్డుకోవాల్సిన ప్రజలు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో రికార్డు కూడా చేశారు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాద్యమాలలో చక్కర్లు కొట్టడంతో ఆ మహిళల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
తమ స్నేహితురాలి భర్తతో బాధితురాలు చనువుగా ఉండటమే ఈ సంఘటనకు కారణమని పేర్కొన్నారు. అందరూ చూస్తున్నారని ఇంకితజ్ఞానం కూడా లేకుండా నడిరోడ్డుపై ఆ యువతిని కొడుతూ, బట్టలు చించి, జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లిన ఈ సంఘటన తూర్పు చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో బొన్జూ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ వీడియోలో ఆ యువతి పట్ల వారు అతికిరాతకంగా ప్రవర్తించారు.
 
యువతి బట్టలను ఒక్కొక్కటిగా తీసేసి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అక్కడున్న వారిలో ఓ మహిళ వచ్చి యువతిని రక్షించడానికి ప్రయత్నించగా వారు ఆమెతో కూడా గొడవ పడ్డారు. మిగాతా వాళ్లు మాత్రం చూస్తూ ఉండిపోయారు. కొందరైతే ఈ తతంగాన్ని ఫోన్లతో రికార్డు చేస్తూ ఉండిపోయారు. అనంతరం ఈ వీడియోని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆ వీడియో చూసిన వారు ఆ మహిళా గ్రూప్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఓ యువతిని కనికరం లేకుండా అలా కొట్టడమేంటి అని... నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments